దొంగతనానికి వచ్చిన దొంగ.. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేక.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు.!

దొంగతనానికి వచ్చిన దొంగ.. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేక.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు.!
Variety Thief

ఓ దొంగకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. దొంగతనం కోసం ఓ ఇంట్లోకి ఎంటరైన దొంగకు ఏం దోచుకోవాలో...

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Jul 06, 2021 | 2:09 PM

ఓ దొంగకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. దొంగతనం కోసం ఓ ఇంట్లోకి ఎంటరైన దొంగకు ఏం దోచుకోవాలో అర్థం కాలేదు. దీంతో ఒట్టి చేతులతో వెనక్కు వెళితే ఏం బాగుటుందనుకున్నాడో ఏమో కానీ, గుమ్మం దగ్గర విడిచిన షూలతో సంతృప్తి పడి అవి తీసుకుని అక్కడి నుంచి జంప్‌ అయ్యాడు. తొలుత రాజాలా లిఫ్ట్‌లో వచ్చి అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్‌లోకి ఎంటరైన అజ్ఞాత వ్యక్తి, లోపలికి వెళ్లేందుకు అవకాశం చిక్కకపోవటంతో ఉత్తిచేతులతో వెనక్కి వెళ్లకుండా కాళ్లకు అక్కడే ఉన్న షూ వేసుకుని వచ్చిన దారినే వెనక్కి మళ్లాడు. అయితే అతగాడి వ్యవహారం మొత్తం సీన్ టు సీన్ సీసీ కెమెరాలో రికార్డు కావటంతో షూల దొంగతనం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ద్వారకాతిరుమలలో ఈ ఘటన జరిగింది.

సాధారణంగా చెప్పుల దొంగతనాలు ఆలయాల దగ్గర ఎక్కువగా జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం ఇంటికి వెళ్లి మరీ ఈ దొంగ ఇంటి బయట ఉన్న షూను దొంగతనం చేశాడు. ద్వారకాతిరుమల ఎస్‌విఎస్ రెసిడెన్సీలో ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగింది. ఆ దొంగ నేరుగా లిఫ్ట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లి అటు ఇటు గమనించాడు. ఓ అపార్ట్మెంట్ బయట ఉన్న షూని ఎగాదిగా చూశాడు. మరలా ఆ దొంగ లిఫ్ట్ వద్దకు వచ్చి తను వేసుకున్న వచ్చిన చెప్పులు అక్కడ విడిచి,షూ వద్దకు వచ్చి, అ షూ తన కాళ్లకు వేసుకుని, తను విడిచిన చెప్పులు కూడా చేత్తో పట్టుకొని, మళ్లీ దర్జాగా లిఫ్టులో కిందకి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా అపార్ట్మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటన తెలిసిన కొందరు అపార్ట్మెంట్‌లో షూ దొంగతనం కోసం రావడం ఏంటని అవాక్కయ్యారు. ఇంట్లో వస్తువులు కాదు…బయట వదిలే చెప్పులు కూడా ఇక నుంచి భద్రం చేసుకోవాల్సిందే…ఎందుకంటే పట్టపగలే చెప్పుల దొంగలు బరితెగించేస్తున్నారు.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu