Andhra Pradesh: పులివెందులలో వెలుగులోకి అమానుష ఘటన.. కసాయిలా ప్రవర్తించిన తల్లి!
రాను రాను మానవత్వం మంట కలిసిపోతోంది. కన్న బిడ్డల పట్ల సైతం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ కన్నతల్లి కూతురికి చేతులపై వాతలుపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. తండ్రిని చూడడానికి వెళ్ళినందుకు కూతురుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఈ అమానుష ఘటన కడప జిల్లా పులివెందులలో వెలుగు చూసింది.

పులివెందుల నియోజకవర్గం లోని సింహాద్రిపురం మండలం అహోబిలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం విభేదాలతో విడిపోయిన సోమేశ్వరమ్మ ఆమె భర్త రామడు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. అయితే తల్లి వద్దనే ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు. తండ్రి మీద మక్కువతో తండ్రిని చూసేందుకు వెళ్లింది పెద్ద కుమార్తె. ఈ విషయం తెలిసిన తల్లి, కూతురుని నిలదీసింది. తండ్రిని చూసేందుకు వెళ్లడంతో ఆగ్రహంతో చితకబాదింది. ఇష్టానుసారంగా చేతిపై వాతలు పెట్టింది. తల్లి అనే మానవత్వాన్ని మరిచి కసాయిగా మారింది.
దంపతులు ఇద్దరు విడిపోయినా పిల్లల భావాలను అర్థం చేసుకోవాల్సిన తల్లి కసాయిలా ప్రవర్తించింది. తండ్రి వద్దకు వెళ్లకూడదు అనే హుకుం పిల్లలకు జారీ చేసింది. ఈ సంఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు మంచిగా చెప్పుకోవాల్సిన పరిస్థితులను మానుకొని వారిపై కక్షపూరిత వ్యవహారించడం ఎంటని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి రాముడు తల్లి వద్ద ఉన్న కూతురిని తీసుకొని వెళ్లి స్థానిక సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో తల్లి సోమేశ్వరముపై ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…