Andhra Pradesh: టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. కన్నెర్ర చేసిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన

Andhra Pradesh: టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. కన్నెర్ర చేసిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్..
Lokesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 20, 2021 | 2:44 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో స్పందించిన ఆయన.. సీఎంను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అని గౌరవించాను గానీ.. తాజా ఘటన చూశాక సైకో, శాడిస్ట్ జగన్ రెడ్డి అని సంబోధిస్తానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, ఆయన బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ తప్పులను నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతారా? అంటూ నిప్పులు చెరిగారు. ప‌రిపాలించ‌మ‌ని ప్రజ‌లు అధికారం అందిస్తే.. పోలీసుల అండ‌తో మాఫియా సామ్రాజ్యం న‌డుపుతావా? అంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఫైర్ అయ్యారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడులకు తెగబడ్డారని, ఎన్నాళ్లు ఇంట్లో దాక్కుని దాడులు చేయిస్తావంటూ లోకేష్ ధ్వజమెత్తారు. ‘‘నువ్వే రా తేల్చుకుందాం.. తెలుగుదేశం పార్టీ నేతల సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు.’’ అంటూ సీఎం జగన్‌పై ఘాటైన పదజాలంతో ధ్వజమెత్తారు. ‘‘మిమ్మల్ని తరిమేయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. మీ అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న కేడర్‌కి మా అధినేత కనుసైగ చేస్తే చాలు. మీ కార్యాలయాలన్నీ నిమిషాల్లో ధ్వంసమైపోతాయి. ఫ్యాన్ రెక్కలు మడిచి, మీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంతవరకు తరిమి తరిమి కొడతారు. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్రజాస్వామ్యానికి పాత‌రేసి.. మీ స‌మాధికి మీరే గొయ్యి త‌వ్వుకుంటున్నారు.’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండగా.. నారా లోకేష్ ఇవాళ విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉద‌యం 8.15 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అన‌కాప‌ల్లి చేరుకుంటారు. రైల్వేస్టేష‌న్ స‌మీపంలో టీడీపీ అన‌కాప‌ల్లి పార్లమెంట‌రీ పార్టీ కార్యాల‌యాన్ని ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభిస్తారు. పార్టీ కార్యాలయ ఆవ‌ర‌ణ‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నూత‌న క‌మిటీ ప్రమాణ‌స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నానికి కార్యక్రమాలు ముగించుకుని విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, లోకేష్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు టీడీపీ నేతలు చినరాజప్ప, బుద్ధ వెంకన్న.

Also read:

Badvel Elections: త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌కు చెక్ పెడతాం.. బీజేపీ నేత సెన్షేషనల్ కామెంట్స్..

Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..

సరదాకి సముద్రంలో వల వేశాడు.. బరువుగా అనిపించి లాగాడు.. ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు..