సరదాకి సముద్రంలో వల వేశాడు.. బరువుగా అనిపించి లాగాడు.. ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు..

Fisherman: అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి సరదాకి సముద్రంలో వల వేశాడు. దానికి చిక్కుకున్న షార్క్‌ చేపని చూసి షాక్‌ అయ్యాడు. దానిని ఒడ్డుకు తీసుకురావడం

సరదాకి సముద్రంలో వల వేశాడు.. బరువుగా అనిపించి లాగాడు.. ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు..
Fisherman
Follow us

|

Updated on: Oct 19, 2021 | 10:20 PM

Fisherman: అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి సరదాకి సముద్రంలో వల వేశాడు. దానికి చిక్కుకున్న షార్క్‌ చేపని చూసి షాక్‌ అయ్యాడు. దానిని ఒడ్డుకు తీసుకురావడం అతడి వల్ల కాలేదు. ఇతరుల సహాయం తీసుకోవలసి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినా తీరంలో జరిగింది. బ్లేక్ కోక్రాన్ అనే వ్యక్తి వృత్తిరీత్యా డాక్టర్. కానీ అతడికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. అందుకోసం ఉత్తర కరోలినా తీరంలో అడుగుపెట్టాడు. సముద్రంలో నెట్ విసిరి చాలా సేపు వేచి ఉన్నాడు. కొంతసేపటికి నెట్‌ కదలడం ప్రారంభించింది. వెంటనే వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. నెట్‌చాలా బరువుగా మారింది. ఒడ్డుకు తీసుకురావడం కోసం అక్కడున్న స్థానికులను పిలిచాడు.

తరువాత చాలా మంది వ్యక్తుల సహాయంతో బ్లేక్ నెట్‌ని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అందులో ఒక కారు సైజంతా హామర్‌హెడ్ సొరచేప చిక్కుకుంది. దీనిని చూసి అక్కడున్న జనంతో పాటు బ్లేక్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ​జాలి గుణం కలిగిన బ్లేక్ ఈ సొరచేపను తిరిగి సముద్రంలోకి విడుదల చేశాడు. నెట్‌లో ఇంత పెద్ద సొరచేపను చూసిన తర్వాత ప్రజలు దానితో చాలా ఫొటోలు దిగారు. కారు సైజులో ఉన్న చేపని చూసి అందరు షాక్‌కి గురయ్యారని బ్లేక్‌ చెప్పుకొచ్చాడు. ఇది తన జీవితంలో పట్టుకున్న అతి పెద్ద చేప అని సంతోషంతో చెప్పారు.

Clapping: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని లాభాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

పార్టీ కార్యాలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

Angry Man: అయ్యయ్యో! భార్య మీద ఆ భర్త కోపం.. పక్కింటి వాళ్లకు శాపం.. ఏం జరిగిందంటే..

Mekathoti Sucharita: డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. హోంమంత్రి సుచరిత