Clapping: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని లాభాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Clapping: సంతోషకరమైన సందర్భంలో చప్పట్లు కొట్టడం ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. కానీ చప్పట్లు కొట్టడం కూడా ఒక గొప్ప వ్యాయామం అని మీకు తెలుసా.. దీని ద్వారా

Clapping: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని లాభాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Clapping
Follow us

|

Updated on: Oct 19, 2021 | 9:49 PM

Clapping: సంతోషకరమైన సందర్భంలో చప్పట్లు కొట్టడం ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. కానీ చప్పట్లు కొట్టడం కూడా ఒక గొప్ప వ్యాయామం అని మీకు తెలుసా.. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు చప్పట్లు కొడితే అది శరీరంలోని శక్తి కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అన్ని సమస్యలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. చప్పట్లు కొట్టడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. శక్తి చక్రాలను ఉత్తేజితం చేస్తుంది.. మీరు రోజూ 10 నుంచి15 నిమిషాలు చప్పట్లు కొడితే ఆయుర్వేదం ప్రకారం.. శరీరంలో ఉన్న ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ చక్రాలు ఉత్తేజితమైతే ఆ వ్యక్తి ఏకాగ్రత, సామర్థ్యం పెరుగుతాయి. దీని కారణంగా జీవితంలో అనేక మార్పులు సంభవించవచ్చు.

2. ఈ వ్యాధులను దూరం చేసుకోండి.. రోజూ చప్పట్లు కొట్టడం ద్వారా పొట్ట సమస్య, మెడ, నడుము నొప్పి, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామంలో చప్పట్లు కొడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.

3. అదనపు కేలరీలు కరుగతాయి.. చప్పట్లు కొట్టేటప్పుడు చేతులు మాత్రమే కాదు శరీరం కూడా కదులుతుంది. దీని అర్థం చప్పట్లు కొట్టడం ద్వారా శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేయవచ్చు. ఊబకాయం పెరగకుండా నిరోధించవచ్చు. రోజూ వ్యాయామం చేయలేకపోతే మీరు క్రమం తప్పకుండా 10 నుంచి 15 నిమిషాలు చప్పట్లు కొట్టాలి.

4. రక్త ప్రసరణలో మెరుగుదల చప్పట్లు కొట్టడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు రోగులకు చప్పట్లు చాలా మంచి వ్యాయామంగా భావిస్తారు. ఇది డిప్రెషన్ వంటి సమస్యల నుంచి వ్యక్తిని రక్షిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో చప్పట్లు కొట్టడం అలవాటు చేసుకోవాలి.

పార్టీ కార్యాలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

Angry Man: అయ్యయ్యో! భార్య మీద ఆ భర్త కోపం.. పక్కింటి వాళ్లకు శాపం.. ఏం జరిగిందంటే..

ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం : మాజీ మంత్రి ‘గంటా’