మహిళలకు గమనిక..! ఆ సమయంలో నోరు చేదుగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..
Dysgeusia: ప్రతి మహిళకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. శిశువుకి జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తడం లాంటిది.
Dysgeusia: ప్రతి మహిళకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. శిశువుకి జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తడం లాంటిది. అందుకే తల్లి ఎంతటి నొప్పినైనా ఆనందంగా భరిస్తుంది. అయితే మహిళలు గర్భం ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటిని మనం పరిష్కరించకపోవచ్చు కానీ తగ్గించే ప్రయత్నం మాత్రం చేయవచ్చు.
గర్భధారణ సమయంలో అందరు మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య డైజ్యూసియా. అంటే నోటిలో చేదు రుచి లేదా లోహ రుచి. డైజ్యూసియా సమయంలో స్త్రీలకు అన్ని ఆహార పదార్థాలలో దుర్వాసన రావడం మొదలవుతుంది. ఆహారం రుచి ఉండదు. నోటిలో ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా మొదటి మూడు నెలల్లో కనిపిస్తుంది. ఇది కాలక్రమేణా నయమవుతుంది. కాబట్టి ఈ సమస్య గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దాని కారణాలు నివారణల గురించి మాత్రం తెలుసుకుందాం.
కారణం ఈ సమస్యకు ప్రధాన కారణం హార్మోన్లలో వచ్చే మార్పులే. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు సంభవిస్తాయి. దీంతో ఈ లక్షణాలు కనిపిస్తాయి. నోటిలో చేదు లేదా లోహ రుచిని కలిగిస్తాయి. ఇది కాకుండా తక్కువ నీరు తాగడం, మందులు తీసుకోవడం వల్ల కూడా నోటి రుచి తీవ్రమవుతుంది.
ఈ చర్యల నుంచి ఉపశమనం 1. నోటి రుచిని మెరుగుపరచడానికి కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోండి. ఇది రుచిని మెరుగుపరుస్తుంది. శరీరం కూడా శక్తిని పొందుతుంది.
2. నోటి రుచిని మెరుగుపరచడానికి మీరు పచ్చి మామిడి, నిమ్మ, నారింజ మొదలైన పుల్లని వస్తువులను తీసుకోవచ్చు. నిమ్మకాయ ఊరగాయ కూడా కొద్దిగా తనవచ్చు. ఇది నోటి రుచిని మెరుగుపరుస్తుంది కడుపు కూడా బాగా ఉంటుంది.
3. నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. మీ పళ్లను క్రమం తప్పకుండా బ్రష్ చేయండి.
4. పెద్ద యాలకులను గ్రైండ్ చేసి తేనెతో కలిపి తింటే రుచి పెరుగుతుంది. ఇది కాకుండా తియ్యటి పదార్థాలు కూడా తినవచ్చు.