Indian Army: భారత సైన్యం చేతిలో త్రిశూల్, వజ్ర ఆయుధాలు.. వీటి ప్రత్యేకతలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Indian Army: ఇప్పటి వరకు భారత అమ్ములపొదిలో ఎన్నో అత్యాధునికి ఆయుధాలు చేరాయి. తాజాగా మరో కొత్తరకం ఆయుధాలు సిద్దమయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత

Indian Army: భారత సైన్యం చేతిలో త్రిశూల్, వజ్ర ఆయుధాలు.. వీటి ప్రత్యేకతలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
Trishul And Vajra

Indian Army: ఇప్పటి వరకు భారత అమ్ములపొదిలో ఎన్నో అత్యాధునికి ఆయుధాలు చేరాయి. తాజాగా మరో కొత్తరకం ఆయుధాలు సిద్దమయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్ ఈ ఆయుధాల రూపకల్పన చేసింది. ఎందుకంటే సరిహద్దు ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. దీని ప్రకారమే గాల్వన్‌ లోయలో చైనా దళాలకు, ఇండియన్‌ ఆర్మీకి ఘర్షన జరిగినప్పుడు వారు ఇనుపరాడ్లు, ముళ్ల కర్రల వంటి ఆయుధాలతో దాడి చేశారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని భారత సైన్యం సరికొత్త ఆయుధాలను తయారు చేయించింది. ఇప్పటి వరకూ పరమశివుని చేతిలో ఆయుధంగా కనపడిన త్రిశూలం ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. తరచుగా భారత భూభాగంలోకి దూసుకొస్తున్న డ్రాగన్‌ దళాలకు షాక్‌ ఇచ్చేందుకు సిద్దమైంది. త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం తయారు చేయించింది. వీటిని నోయిడాకు చెందిన అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ రెడీ చేసింది. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. త్రిశూల్‌
శివుని చేతిలో ఉండే ఆయుధం త్రిశూలం. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ‘త్రిశూల్‌’ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. త్రిశూల్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌కి గురువుతాడు.

2. వజ్ర
ఇది ఒక బ్యాటరీ సాయంతో పనిచేసే ఇనుప కడ్డీ. దీనిపై ముళ్లు ఉంటాయి. విద్యుత్‌ను విడుదల చేయడం ద్వారా ఈ ఆయుధం ఒక వ్యక్తికి షాక్‌ కలిగిస్తుంది. దీనివల్ల శత్రువు కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళుతాడు. శత్రు సైనికుల వాహనాలపై కూడా దాడి చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై ఉండే ముళ్లు వారి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల టైర్లను కూడా పంక్చర్‌ చేస్తాయి.

3. సప్పర్‌ పంచ్‌
చేతికి వేసుకునే గ్లవ్స్‌ మాదిరిగా ఉంటుంది ఈ ఆయుధం. దీనిని ధరించి శత్రు సైనికుడిని కొడితే షాక్‌ గురై అపస్మారక స్థితిలోకి వెళుతాడు.

4. దండ్‌
ఇది బ్యాటరీ సాయంతో పనిచేసే విద్యుత్‌ కర్ర. ఇది షాక్‌ని కలిగిస్తుంది. ఇది పనిచేయడానికి ఒక సేఫ్టీ స్విచ్‌ అవసరం. అది విడిగా ఉంటుంది ఒకవేళ శత్రువు దీన్ని లాక్కుని వెళ్లినా దానిని వాడుకోవడం వారికి తెలియదు.

5. భద్ర
ఇది సైనికులకు ఒక రక్షణ కవచం లాంటిది. రాళ్ల దాడుల నంచీ కాపాడటమే కాక, మిరుమిట్లుగొల్పే కాంతిని వెలువరించడం ద్వారా శత్రువుకి కళ్లు కనిపించకుండా చేస్తుంది.

CM KCR Yadadri: స్వామివారి పాదాల చెంత యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రిక

Mohan Babu: నటుడు మోహన్‌బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఉత్తరాఖండ్‌ దృశ్యాలు..! వరదనీటికి ఎదురు నిలిచి జనాలను కాపాడుతున్న సోల్జర్స్‌.. వీడియో చూడండి..

Click on your DTH Provider to Add TV9 Telugu