Mohan Babu: నటుడు మోహన్‌బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు.. ఎందుకంటే..

నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ వృత్తిని మోహన్ బాబు అవమాన పరిచారని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ

Mohan Babu: నటుడు మోహన్‌బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు.. ఎందుకంటే..
Mohan Babu
Follow us

|

Updated on: Oct 19, 2021 | 6:12 PM

Mohan Babu: నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ వృత్తిని మోహన్ బాబు అవమాన పరిచారని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, ఘర్షణలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా ఎన్నికల్లో ఏమిటీ గొడవలు.. ఏమిటి బీభత్సం.. ఏంటి ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు.. గొర్రెలు, మేకలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతను కూడా ఇక్కడ జరిగిందంతా చూస్తున్నాడు. అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని.. అని అన్నారు.

దాంతో తమ వృత్తిని అవమానించేలా మోహన్ బాబు మాట్లాడారని, ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొర్రెల కాపరులు చూస్తే సినిమా వాళ్ళ గౌరవం పోతుంది అనేలా మోహన్ బాబు మాట్లాడారని.. ఈవిధంగా తమను అవమానిస్తూ మాట్లాడటం సరికాదని.. మోహన్ బాబు పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని.. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికల రచ్చ గురించి అందరికి తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..

Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!