Madanapalle: అయ్యో..! ఇంత చిన్న కారణానికే ఆత్మహత్యా.. చర్చనీయాంశమైన టీనేజర్ సూసైడ్

చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. బంగారంలాంటి భవిష్యత్‌ను క్షణికావేశంలో చిదిమేసుకుంటున్నారు. జన్మనిచ్చిన తలిద్రండులు....

Madanapalle: అయ్యో..! ఇంత చిన్న కారణానికే ఆత్మహత్యా.. చర్చనీయాంశమైన టీనేజర్ సూసైడ్
Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2021 | 4:23 PM

చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. బంగారంలాంటి భవిష్యత్‌ను క్షణికావేశంలో చిదిమేసుకుంటున్నారు. జన్మనిచ్చిన తలిద్రండులు ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు. అర్థాంతరంగా తనవు చాలిస్తూ.. వారికి తీరన వేదన మిగులుస్తున్నారు. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్​కి ఉరివేసుకొని టీనేజర్ బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎస్‌.సల్మా(17)… ఈ మధ్య ఫోన్​ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్​ వాడొద్దని… ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావంటూ మందలించారని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గద్దించడంతో మనస్తాపం చెందిన సల్మా… ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకే కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

తాడిపత్రిలో సైకిల్‌ను ఢీకొన్న లారీ.. 8 ఏళ్ల బాలుడు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది.  సైకిల్​ని లారీ ఢీకొట్టడంతో ఎనిమిదేళ్ల ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తమ బిడ్డ ఇక లేడని, తిరిగిరాడని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా తరుచుగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. విషార యాత్రలు కాస్తా విషాద యాత్రలుగా టర్న్ తీసుకుంటున్నాయి.  పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రులలో భయం నెలకుంటుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలతో ఇంటి నుంచి రోడ్డు మీదికెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

Also Read: ముళ్లపొదల్లో పసిబిడ్డ.. బావిలో మైనర్ బాలిక మృతదేహం.. శిశువుకు జన్మనిచ్చి ఆపై

 5 కంటే ఎక్కువ కేసులు నమోదైతే స్కూల్ క్లోజ్.. వ్యాక్సిన్ వేయించుకోకపోతే అక్కడ నో ఎంట్రీ

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్