TDP Vs YCP: టీడీపీ, వైసిపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్.. టీడీపీ నేతలు మృతి అంటూ పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియాల్ తనపై చేస్తోన్న పోస్టులను చేసున్నవారిపై చర్యలు తీసుకోవాలని.. జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఆశ్రయించారు. మరోవైపు వైసిపి శ్రీరామ వరం సర్పంచ్ కామిరెడ్డి నాని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లో ఎన్నికల వేడి ఇప్పుడే తారాస్థాయికి చేరుకుంది. అధికార వైసీపీ పార్టీ, ప్రతి పక్షపార్టీ టీడీపీ నేతల మధ్య వార్ రేంజ్ లో కొనసాగుతోంది. నువ్వు ఒకటి అంటే నేను పది అంటా అన్నచందంగా ఇరునేతల మాటల తూటాలు విసీరుతున్నారు. తాజాగా దెందులూరులో టీడీపీ, వైసిపీ నేతల మధ్య వార్ వేదిక మారింది. సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల నేతలు కొట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయచౌదరి లను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కొందరు పోస్టులు చేశారు. పలువురు టీడీపీ నేతలు చని పోయినట్లు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్టులు చేశారు.
సోషల్ మీడియాల్ తనపై చేస్తోన్న పోస్టులను చేసున్నవారిపై చర్యలు తీసుకోవాలని.. జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఆశ్రయించారు. మరోవైపు వైసిపి శ్రీరామ వరం సర్పంచ్ కామిరెడ్డి నాని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా అబ్బాయచౌదరై మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చేటపుడే అన్నిటిని ఆలోచించానని.. రాజకీయంగా ఎదురయ్యే విమర్శలకు సిద్ధపడే ఉన్నానని పేర్కొన్నారు. అంతేకాదు తాను హుందా రాజకీయాలు చేయాలని భావిస్తానని.. కేవలం పలకరింపు కోసం చింతమనేని ఇంటికి వెళ్లానని పేర్కొన్నారు. అయితే ఈ వివాదంలో తన కుటుంబ సభ్యులను లాగటం.. వారి గురించి మాట్లాడడం తనకు బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే, ఎంత పెద్ద వాళ్లయినా వదిలేది లేదని చెప్పారు.




REP : RAVI
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..