AP 10th Class Results 2023: టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల.. పార్వతీపురం ఫస్ట్.. నంద్యాల లాస్ట్.. రిజల్ట్ ఇక్కడ చూడండి..
AP SSC Results 2023 Live Updates: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ పదవ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేసే పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది టెన్త్ స్టూడెంట్స్ ఉత్కంఠతకు కాసేపట్లో తెరపడనుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ పదవ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేసే పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాలు ఇక్కడ చూసుకోండి:
ఇలా చెక్ చేసుకోండి
bse.ap.gov.inలో BSEAP అధికారిక సైట్‌ని సందర్శించండి.
Step 2:హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ క్లిక్ చేయండి.
Step 4: పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Step 5: ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోండి..
LIVE NEWS & UPDATES
-
పదో తరగతి ఫలితాలు ఇక్కడ చూసుకోండి..
-
మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం.. ఎక్కువ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించడానికి ఆసక్తి
మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం.. ఎక్కువ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు మంత్రి బొత్స. దీనికి కారణం తమ ప్రభుత్వం స్కూల్స్ లో చేసిన అభివృద్ధే అని చెప్పారు.
-
-
ప్రయివేట్ స్కూల్స్ పెట్టుకోవాలన్నా.. రెన్యువల్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ ద్వారానే..
ఏపీలో ఇక నుంచి ప్రయివేట్ స్కూల్స్ కు పెట్టుకోవాలన్నా.. రెన్యువల్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ ద్వారానే అని మంత్రి బొత్సా ప్రకటించారు. ఈ మేరకు ఆన్ లైన్ కు సంబంధించిన ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. సింగిల్ విండో ఆన్ లైన్ పోర్టల్ ను ఆవిష్కరించారు.
-
పాస్ అయిన స్టూడెంట్స్ కు బెస్ట్ విషెస్ చెప్పిన మంత్రి బొత్సా..
నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ కు, అత్యధిక శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు , ఆ స్కూల్ టీచర్స్ ను పోత్సహించే విధంగా ప్రణాళికలను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడవద్దని.. పరీక్షలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి బొత్సా పేర్కొన్నారు. విద్యా అకడమిక్ సంవత్సరం వెస్ట్ కాకుండా మళ్ళీ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.
-
జూన్ రెండు నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు గడువు
ఏపీలో 75.38 శాతం మంది బాలికలు పాస్ కాగా, 69.27 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరగడం విశేషం.. జూన్ 2 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు. అంతేకాదు విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు
-
-
గత ఏడాదికంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం..
ఏపీలో 933 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ఉండగా.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదఅయింది. 75.38 శాతం మంది బాలికలు పాస్ కాగా, 69.27 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరగడం విశేషం
-
933 స్కూల్స్ లో 100 శాతం ఉత్తీర్ణత.. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ 2022- 2023 ఫలితాలను విడుదల చేశారు.
స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేసి కేవలం 18 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని మంత్రి బొత్సా చెప్పారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది. 933 స్కూల్స్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 33 శాతం స్కూల్స్ లో తక్కువ శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు.
-
75.8 శాతం మంది స్టూడెంట్స్ కు ఫస్ట్ క్లాస్..ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్స్ అత్యధికంగా ఉత్తీర్ణత..
75.8 శాతం మంది స్టూడెంట్స్ కు ఫస్ట్ క్లాస్ రాగా .. పాస్ అయిన వారిలో ఇంగ్లిష్ మీడియాలో రాసిన స్టూడెంట్ 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
-
ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్
ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్
-
మొదటి ప్లేస్ లో పార్వతి పురం మన్యం జిల్లా.. చివరి ప్లేస్ లో నంద్యాల జిల్లా
శాతం ఉత్తీర్ణతతో 87. 47 శాతంతో పార్వతి పురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 60. 72 శాతంతో చివరి ప్లేస్ లో నంద్యాల జిల్లా ఉన్నది.
-
మొత్తం 72. 26 శాతం మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 72. 26 శాతం మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 6 శాతం అధికంగా ఉంది.
-
దేవుడు ఎవరికీ ఎంత ఇవ్వాలో ముందే రాసి ఉంటాడు.. నిరాశపడొద్దు అన్న విద్యాశాఖ అధికారి
విజయవాడలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి 2022-2023 ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తున్నారు.. ముందుగా ఏపీ విద్యాశాఖ అధికారి మోహన్ లాల్ ద్వివేది మాట్లాడుతూ.. జీవితం నిరంతరం ప్రవహించే నది వంటిదని.. ఫలితాలను బట్టి విద్యార్థులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. దేవుడు ఎవరికీ ఏమి ఇవ్వాలో ముందుగానే రాసి ఉంటాడని
-
2022-2023 ఏడాది టెన్త్ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేస్తున్న మంత్రి బొత్సా..
విజయవాడలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి బొత్సా 2022-2023 ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి బొత్సా అభినందనలు తెలిపారు.
-
పదవ తరగతి పరీక్ష ఫలితాలను స్టూడెంట్స్ ఏ డైరెక్ట్ లింక్ ద్వారా చేసుకోవచ్చు అంటే..
విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.. దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్ లో కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. manabadi.co.in లాంటి వెబ్‌సైట్లలో కూడా ఏపీ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
-
కేవలం 18 రోజుల్లోనే టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తోన్న బోర్డు..
ఏపీలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగాయి. అయితే కేవలం 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) పదవీ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయడం విశేషం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు.
Published On - May 06,2023 10:23 AM