‘సీఎం పదవి కోసం ముసలివాళ్లను కూడా మోసం చేసిన ఘనత అతనిదే.. నవరత్నాల పేరుతో నవనామాలు పెట్టారు’

మాట తప్పడం.. మడమ తిప్పటం, నమ్మించి మోసం చేయటం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నైజమని టీడీపీ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి..

'సీఎం పదవి కోసం ముసలివాళ్లను కూడా మోసం చేసిన ఘనత అతనిదే.. నవరత్నాల పేరుతో నవనామాలు పెట్టారు'
Dola Veeranjaneyulu
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 01, 2021 | 9:40 PM

Dola Bala Veeranjaneyulu: మాట తప్పడం.. మడమ తిప్పటం, నమ్మించి మోసం చేయటం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నైజమని టీడీపీ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. జగన్ తన పాదయాత్రలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఫించన్ దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ వరకు జగన్ అన్నింటా మాటతప్పారన్నారాయన.

“వృద్ధాప్య ఫించన్ రూ. 3 వేలకు పెంచుతామని కేవలం రూ. 250 మాత్రమే పెంచారు. 2021 జూలై 8న వైయస్ పుట్టిన రోజున పించన్ రూ, 2,250 నుంచి రూ. 2,500 కు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కానీ ఆగస్టు నెల పించన్ కూడా పెంచకుండా రూ. 2,250 మాత్రమే ఇచ్చారు. ఓట్ల జగన్ మమ్మిల్ని మోసం చేశారని వృద్దులు, వితంతవులు, వికలాంగులు వాపోతున్నారు. వారిని మోసం చేయటానికి జగన్ రెడ్డికి మనసెలా వచ్చింది?” అని డోలా ప్రశ్నించారు.

“ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు 45 ఏళ్లకే ఫించన్ ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు.. హామీలు అమలు చేయటం చేతకానప్పుడు హామీలివ్వటం ఎందుకు ? ప్రజలను మోసం చేయటం ఎందుకు? ఏ ఆదారం లేకుండా జీవిస్తున్న వృద్దులను, వితంతవులు, వికలాంగులను మోసం చేయటం సరికాదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు నెల నుంచే ఫించన్ రూ, 2500 పెంచాలి.” అని డోలా బాలవీరాంజనేయులు డిమాండ్ చేశారు.

Read also: AP Governor: ఈ ఏడాది కూడా పుట్టిన రోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్