TDP-BJP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. ఆసక్తికరంగా సుజనా, కన్నా, నక్కా ఆనంద్, ఆలపాటి భేటీ
ఏపీలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్‌పెరిగింది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంట్లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం.. ఈ సమావేశానికి టీడీపీ నేతలు హాజరయ్యారు. దీంతో గుంటూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర..

గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి ఆదివారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రావడం చర్చకు దారి తీసింది. సుజనా చౌదరి చేరుకున్న కాసేపటికే టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా అక్కడికి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. గుంటూరులో సుజనా చౌదరి, న్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటిల భేటీతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. సాధారణ సమావేశం అంటూనే రాజకీయాలపై నేతలు చర్చించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే సమావేశం అనంతరం నేతలంతా కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో అరాచక పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ప్రజలు తిరుగుబాటు చేయకుంటే యువత భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి చేయడం దారుణమన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సుజనా చౌదరి హెచ్చరించారు.
అమరావతి రాజధానికే కేంద్రం కట్టుబడి ఉందని.. సుజనా చౌదరి చెప్పారన్నారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. మరోవైపు అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని సంకేతాలిచ్చారు. ఏపీలో కొద్దిరోజులుగా పొత్తులపై ప్రచారం నడుస్తోంది.
ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీ నేతలు భేటీ కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరోవైపు కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఇరు పార్టీల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పొత్తులకి బలాన్నిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
