Andhra Pradesh: ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన.. మహిళా పోలీసుల తీరుపై లోకేశ్ ఫైర్

కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మీనాక్షమ్మ ఘటనపై టీడీపీ లీడర్ నారాలోకేశ్(Nara Lokesh) ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. మీ నుంచి రక్షణ కల్పించే యాప్‌...

Andhra Pradesh: ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన.. మహిళా పోలీసుల తీరుపై లోకేశ్ ఫైర్
Lokesh
Follow us

|

Updated on: Jun 03, 2022 | 1:25 PM

కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మీనాక్షమ్మ ఘటనపై టీడీపీ లీడర్ నారాలోకేశ్(Nara Lokesh) ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. మీ నుంచి రక్షణ కల్పించే యాప్‌ ఉంటే చెప్పాలని ఎద్దేవా చేశారు. పోలీసులు, వాలంటీర్ల అరాచకాల నుంచి రక్షించే యాప్‌ ఉందా సీఎం సారూ? అంటూ సీఎం జగన్(CM Jagan) ​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్నూలు జిల్లాలో మ‌హిళా పోలీసుల ప్రవర్తన చూశారా? అని ప్రశ్నించిన లోకేశ్.. తన ఇంటిముందు స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంటే ఆ కుటుంబం పడిన వేదన మీకు కనిపించలేదా అని నిలదీశారు. ఆమె కుమార్తెను పోలీసులు నెట్టేశారని, చున్నీతో చేతులు కట్టేశారని మండిపడ్డారు. సాటి మహిళలని కూడా చూడకుండా ఇలా ప్రవర్తిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలంతా ఒక్కటై నిలదీయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మీనాక్షమ్మ అనే మహిళ.. తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలు వేసుకుంది. అయితే ఆ స్ధలంలో రైతు భరోసా(Raitu Bharosa) పాలకేంద్రం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మీనాక్షమ్మ ఇంటి వద్దకు జేసీబీతో చేరుకుని కట్టెలు తొలగించే ప్రయత్నం చేశారు. ఇంటి ముందు ఉన్న స్ధలం తమదేనని, యాభై ఏళ్ల నుంచి ఆ స్ధలంలో కట్టెలు వేసుకుంటున్నామని మీనాక్షమ్మ ప్రాధేయపడినా రెవెన్యూ సిబ్బంది కనికరించలేదు.

దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మీనాక్షమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు అప్రమత్తమై మీనాక్షమ్మను అడ్డుకున్నారు. అంతే కాకుండా అక్కడే ఉన్న మీనాక్షమ్మ కుమార్తెలను మహిళా కానిస్టేబుల్ చున్నీతో కట్టి, స్ధలం దగ్గరకు వెళ్లకుండా చేశారు. తమను విడిచి పెట్టాలని మీనాక్షమ్మ కూతుళ్లు మహిళా పోలీసులను అడిగినా వాళ్లు చలించలేదు. స్ధలం ఖాళీ చేశాకే వారిని విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి