CM Jagan: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..
రెండో రోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన అనంతరం ఆయన విమానాశ్రయానికి బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కొనసాగిన ముఖ్యమంత్రి పర్యటనలో..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో(Amit Shah) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) భేటీ అయ్యారు. 45 నిమిషాలు షాతో చర్చించారు సీఎం జగన్. విభజన హామీల సహా, రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన అనంతరం ఆయన విమానాశ్రయానికి బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కొనసాగిన ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు సీఎం జగన్. చర్చలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చిన సీఎం జగన్.. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో మొదటిరోజు పర్యటన గురువారం సాగగా.. ప్రధాని మోదీ, ఆపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు సీఎం జగన్. ఆపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రిని కోరారు.
నిన్న(గురువారం) ప్రధాని నరేంద్రమోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశమైన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పోలవరం బిల్లులు త్వరగా చెల్లించాలని మెమొరాండం ఇచ్చారు. అలాగే, FRBM సీలింగ్‌ను సవరించి, కొత్త రుణాలు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇక, స్టేట్ పెండింగ్ ఇష్యూస్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు సీఎం జగన్. కడప స్టీల్ ప్లాంట్ కోసం APMDCకి ఐరన్ ఓర్ గనుల కేటాయింపు, కొత్త మెడికల్ కాలేజీలు, ఆహార భద్రత లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ.. ఇలా అనేక అంశాలపై ప్రధానితో చర్చించారు.
సవరించిన అంచనాల ప్రకారం పోలవరం టోటల్ వ్యయాన్ని 55వేల 550కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 905కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్, 26 జిల్లాలకు తగ్గట్టుగా కొత్తగా 12 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలన్నారు సీఎం జగన్. 17వేల 923కోట్ల రుణాలకు అనుమతితోపాటు 32వేల 625కోట్ల రెవెన్యూ లోటు నిధులు ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ .. తన పర్యటన ముగించుకున్నారు.




