Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు.

Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
Tdp Leader Dhulipalla Narendra Kumar Arrest
Follow us

|

Updated on: Apr 23, 2021 | 9:43 AM

TDP leader Dhulipalla Narendra Arrest:  తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీస్ లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.

Acb On Narendra Arrest

Acb On Narendra Arrest

ఇదిలావుంటే, తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. టీడీపీ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల కిలారి వెంకట రోశయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. 1112 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతేకాదు 2010 నుంచి సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు ధూళిపాళ్ల నరేంద్ర.

Read Also…

PM Modi: దేశాన్ని కబళిస్తన్న కరోనా మహమ్మారి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 3 కీలక సమావేశాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష