Chandrababu: టీడీపీ అభ్యర్థి ప్రకటనపై జనసేనలో అలజడి.. వరుస సభలతో దూసుకెళ్తున్న బాబు..
ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా.. కదిలిరా సభలతో కేడర్‌లో జోష్ పెంచుతున్నారు. ఓఅడుగు ముందుకేసి అరకు, మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేశారు.

ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా.. కదిలిరా సభలతో కేడర్‌లో జోష్ పెంచుతున్నారు. ఓఅడుగు ముందుకేసి అరకు, మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేశారు. దీంతో టీడీపీ, అటు జనసేనలో అలజడి మొదలైంది. అభ్యర్థుల అనౌన్స్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు స్థానిక నేతలు. రెబల్‌గా తాము కచ్చితంగా పోటీలో ఉంటామంటూ హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ తర్వాత అరకు, మండపేటల్లో టికెట్ మంటలు రేగాయి. అరకు సభ వేదికగా దొన్ను దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు. కన్ఫూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకోవాలని సూచించారు బాబు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, అరకులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు బాబు.
దొన్ను దొర పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారనంటూ సోమా కుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇన్నేళ్లు తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు అబ్రహం. అటు మండపేటలోను రా కదిలిరా బహిరంగ సభకు హాజరయ్యారు చంద్రబాబు. తన 43ఏళ్ల రాజకీయ చరిత్రలో మండపేట లాంటి ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడ లేదన్నారు. మండపేటలో ప్రశాంతత కొనసాగాలంటే మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావును మళ్లీ గెలిపించాలని కోరారు బాబు.
చంద్రబాబు అనౌన్స్ మెంట్ తర్వాత జనసేన నేతలు సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మండపేట జనసేన నేత లీలాకృష్ణ చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నేత లీలాకృష్ణ చంద్రబాబు పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్లు సర్దుబాటుకు ముందే అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు లీలాకృష్ణ. అటు వైసీపీలోనే కాదు.. టీడీపీ, జనసేనలోను సీట్ల సర్దుబాటు వివాదంగా మారింది. ఇలాంటి వివాదాలు మరోసారి తెరపైకి రాకుండా.. ఇక నుంచి సభలకు ముందే నేతలతో చర్చించి.. నేతల మధ్య సమన్వయం కుదిరాక అభ్యర్థులను అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




