టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఎవరికి చోటు లభించిందంటే.?

|

Updated on: Feb 24, 2024 | 2:33 PM

ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. మొదట జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు, జనసేన నుంచి 24 మంది అభ్యర్థులను ప్రకటించారు

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఎవరికి చోటు లభించిందంటే.?
Tdp Janasena

ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. మొదట జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు, జనసేన నుంచి 24 మంది అభ్యర్థులను ప్రకటించారు. గతంలో పది స్థానాలు సాధించి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటీ చేస్తున్న స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని అన్నారు. 3 పార్లమెంట్ సీట్లతో కలుపుకుంటే మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్టే అని తెలిపారు. పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇస్తామని అన్నారు. అటు బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. వినాశనానికి దారి తీసిన వైసీపీ పాలనను తిప్పికొట్టడానికి టీడీపీ, జనసేన నడుము బిగించాయన్నారు పవన్ కళ్యాణ్. అటు బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ, జనసేనపై ఉన్నాయని స్పష్టం చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2024 01:23 PM (IST)

    టీడీపీ నేతల్లో అసంతృప్తి..

    సీట్ల ప్రకటన తరువాత టీడీపీ నేతల్లో అసంతృప్తి మొదలైంది..అన్నమయ్య జిల్లా రాయచోటి టికెట్‌ రాకపోవడంతో రమేష్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు..రాయచోటి టికెట్‌పై చంద్రబాబుది అనాలోచిత నిర్ణయం అంటూ ఆరోపించారు రమేష్‌రెడ్డి..నిన్న చంద్రబాబు ఫోన్‌ చేసి టికెట్‌ లేదని చెప్పారు..అయితే టీడీపీకి తాను సహకరించనని చంద్రబాబుకు చెప్పా..త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యచరణ ప్రకటిస్తా అన్నారు రమేష్‌రెడ్డి..

  • 24 Feb 2024 01:22 PM (IST)

    వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురిలో ఒకరికి చోటు

    • — వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురిలో ఒకరికి చోటు

    • — నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేరు ప్రకటన

    • — పేర్లు ప్రకటించని వారిలో ఆనం రామనారాయణరెడ్డి..

    • — కనిపించని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు

  • 24 Feb 2024 01:21 PM (IST)

    టీడీపీ తొలి జాబితాలో కనిపించని సీనియర్లు

    • — టీడీపీ తొలిజాబితాలో కనిపించని సీనియర్లు

    • — దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు నిరాశ

    • — జాబితాలో పేరులేని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

    • — పెనుకొండలో పార్థసారథికి మొండిచేయి

    • — ఆలపాటి రాజా పేరు ప్రకటించని టీడీపీ

    • — రక్తాభిషేకం చేసిన బుద్ధావెంకన్నకు మొండిచేయి

    • — జాబితాలో లేని కళా వెంకట్రావు

    • — గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా

    • — పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్‌

    • — ఉండి నుంచి వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం

  • 24 Feb 2024 01:20 PM (IST)

    జనసేన నేతల్లో అసంతృప్తి

    • — సీట్ల ప్రకటన తరువాత జనసేన నేతల్లో అసంతృప్తి

    • — ఉమ్మడి పశ్చిమగోదావరి జనసేన నేతల్లో అసహనం

    • — ఏలూరు సీటు టీడీపీకి ఇవ్వడంపై జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు అసంతృప్తి

    • — తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం

    • — తణుకు సీటు టీడీపీకి ఇవ్వడంతో భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు

    • — గతంలో తణుకు నుంచి విడివాడను ఎమ్మెల్యేగా.. గెలిపించాలని శ్రేణులను కోరిన పవన్ కల్యాణ్

    • — పొత్తుల్లో భాగంగా ఆయా సీట్లలో టీడీపీ పోటీ

  • 24 Feb 2024 01:19 PM (IST)

    రాయలసీమ టీడీపీ అభ్యర్థుల లిస్టు ఇదే..

    • — రాయలసీమలో 29 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

    • — రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు

    • — రాయలసీమలో ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని జనసేన

    • — 2019లో గెలిచిన ముగ్గురికీ మళ్లీ టికెట్లిచ్చిన టీడీపీ

    • — కుప్పం నుంచి చంద్రబాబు మళ్లీ పోటీ

    • — హిందూపురం నుంచి మళ్లీ బరిలో నందమూరి బాలకృష్ణ

    • — ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ తిరిగి పోటీ

  • 24 Feb 2024 01:18 PM (IST)

    సీట్ల ప్రకటన తరువాత టీడీపీ నేతల్లో అసంతృప్తి..

    సీట్ల ప్రకటన తరువాత టీడీపీ నేతల్లో అసంతృప్తి మొదలైంది..అన్నమయ్య జిల్లా రాయచోటి సీటును టీడీపీ ఇన్‌ఛార్జ్‌ రమేశ్‌రెడ్డికి కాకుండా రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించడంపై అసహనం వ్యక్తమైంది..అనాలోచిత నిర్ణయంతోనే చంద్రబాబు రాయచోటి టికెట్‌ని కేటాయించారంటూ ఆరోపించారు రమేష్ రెడ్డి..కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు..

  • 24 Feb 2024 12:59 PM (IST)

    టీడీపీ-జనసేన జాబితాలో యువత, మహిళలకు ప్రాధాన్యం

    • — టీడీపీ-జనసేన జాబితాలో యువత, మహిళలకు ప్రాధాన్యం

    • — విద్యావంతులకు అవకాశం

    • — 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు ఇద్దరు

    • — 36 నుంచి 45 ఏళ్ల మధ్య 22 మంది

    • — 46 నుంచి 60 మధ్య 55 మంది అభ్యర్థులు

    • — 61 ఏళ్లకన్నా ఎక్కువ అభ్యర్థులు 20 మంది

    • — 99 మంది అభ్యర్థుల్లో 13 మంది మహిళలు

    • — అభ్యర్థుల్లో ఒకరు మాజీ IAS (రామాంజనేయులు)

    • — PhD చేసినవారు ఇద్దరు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు 30 మంది

    • — ముగ్గురు వైద్యులు, 63 మంది గ్రాడ్యుయేట్స్‌

  • 24 Feb 2024 12:58 PM (IST)

    అభ్యర్థుల ప్రకటనతో టీడీపీలో మొదలైన అసమ్మతి

    • — అభ్యర్థుల ప్రకటనతో టీడీపీలో మొదలైన అసమ్మతి

    • –కళ్యాణదుర్గం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి

    • –కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు పేరు ఖరారు

    • –చంద్రబాబు ప్రకటనతో ఉన్నం వర్గం ఆగ్రహం

    • –చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసిన ఉన్నం వర్గం నాయకులు

    • –ఉన్నం హనుమంతరాయ ఆఫీసులో టీడీపీ జెండాలను తీసేసిన అభిమానులు

  • 24 Feb 2024 12:53 PM (IST)

    తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు, పవన్‌

    • — తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు, పవన్‌

    • — 99 సీట్లు ప్రకటించిన టీడీపీ-జనసేన

    • — 94 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

    • — 18 SC సీట్లలో అభ్యర్థులు ఖరారు

    • — 3 ST స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

    • — తొలిసారి బరిలోకి 23 మంది అభ్యర్థులు

    • — అభ్యర్థుల్లో 28 మంది ఉన్నత విద్యావంతులు

    • — తొలిజాబితాలో బీసీలు, యువతకు ప్రాధాన్యం

    • — 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన అభ్యర్థుల ప్రకటన

    • — ఇరుపార్టీలు పట్టుబడుతున్న సీట్లు ప్రస్తుతానికి పెండింగ్‌

    • — 24 సీట్లలో పోటీచేయనున్న జనసేన

    • — 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ

    • — పవన్‌ కల్యాణ్‌ పోటీచేసే సెగ్మెంట్‌పై రాని స్పష్టత

    • — జనసేన ప్రకటించాల్సిన సీట్లు 19

    • — ఇంకా టీడీపీ ప్రకటించాల్సిన సీట్లు 57

  • 24 Feb 2024 12:51 PM (IST)

    టీడీపీ తొలి జాబితాలో వీరికి దక్కని చోటు

    • — తొలి జాబితాలో చోటులేని కీలకనేతలు

    • — సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి..

    • — యరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు

    • — కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • — పీతల సుజాత, గౌతు ఫ్యామిలీ పేర్లు ప్రకటించని టీడీపీ

  • 24 Feb 2024 12:34 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల జాబితా ఇది..

    • ఉరవకొండ – పయ్యావుల కేశవ్

    • కడప – రెడ్డప్పగారి మాధవి

    • పులివెందుల – బీటెక్ రవి

    • మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

    • కర్నూలు – టీజీ భరత్

    • నంద్యాల – NMD ఫరూక్

    • పాణ్యం – గౌరు చరితా రెడ్డి

    • పత్తికొండ – కేఈ శ్యాం

    • ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

  • 24 Feb 2024 12:34 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదిగో..

    • నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    • సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    • ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

    • గూడూరు – పాశం సునీల్

    • కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

    • నగరి – గాలి భాను ప్రకాష్

    • పలమనేరు – అమర్నాథ రెడ్డి

    • హిందూపురం – బాలకృష్ణ

    • తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

    • రాప్తాడు – పరిటాల సునీత

  • 24 Feb 2024 12:33 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదిగో..

    • రేపల్లె – అనగాని సత్యప్రసాద్

    • వేమూరు – నక్కా ఆనంద్ బాబు

    • అద్దంకి – గొట్టిపాటి రవికుమార్

    • పర్చూరు – ఏలూరి సాంబశివరావు

    • కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

    • కొండెపి – డోలా బాల వీరాంజనేయులు

    • ఒంగోలు – దామచర్ల జనార్దన్

    • ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు

    • మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి

    • నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

  • 24 Feb 2024 12:28 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల లిస్టు ఇదిగో..

    • నందిగామ – తంగిరాల సౌమ్య

    • విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు

    • విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్

    • మంగళగిరి – నారా లోకేష్

    • పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

    • ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు

    • తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్

    • చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

    • మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

    • సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

  • 24 Feb 2024 12:27 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే..

    • ఉండి – మంతెన రామరాజు

    • చింతలపూడి – సొంగా రోషన్

    • దెందులూరు – చింతమనేని ప్రభాకర్

    • ఏలూరు – బడేటి రాధాకృష్ణ

    • గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

    • గుడివాడ – వెనిగండ్ల రాము

    • మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

    • పెడన – కాగిత కృష్ణ ప్రసాద్

    • జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

    • తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్

  • 24 Feb 2024 12:26 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే..

    • కొత్తపేట – బండారు సత్యానందరావు

    • మండపేట – జోగేశ్వర రావు

    • జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

    • పెద్దాపురం – చిన రాజప్ప

    • తుని – యనమల దివ్య

    • అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

    • రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్

    • పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

    • ఆచంట – పితాని సత్యనారాయణ

    • తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

  • 24 Feb 2024 12:25 PM (IST)

    టీడీపీ అభ్యర్థుల జాబితా..

    • ఆముదావలస – కూన రవికుమార్
    • ఇచ్ఛాపురం – బెందాలం అశోక్
    • టెక్కలి – అచ్చెన్నాయుడు
    • రాజాం – కొండ్రు మురళీమోహన్
    • అరకు – దొన్ను దొర
    • సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి
    • అనకాపల్లి – పీలా గోవింద్
    • నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
    • విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
    • విశాఖ వెస్ట్ – గణ బాబు
  • 24 Feb 2024 12:21 PM (IST)

    పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ మాట ఇదే..

    టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తులపై హైకమాండ్‌దే నిర్ణయమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి కనుక సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారన్నారు. పొత్తులపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకునే వరకు పొత్తులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కసరత్తు జరుగుతుందన్నారు పురంధేశ్వరి.

  • 24 Feb 2024 12:16 PM (IST)

    మంగళగిరి నుంచి లోకేష్ పోటీ..

    ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు తొలి విడత అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ప్రకటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.

  • 24 Feb 2024 12:06 PM (IST)

    జనసేన అభ్యర్థుల లిస్ట్..

    తొలి విడతగా ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వారు ఎవరంటే..

    తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి – నాదెండ్ల మనోహర్

    నెల్లిమర్ల – లోకం మాధవి

    అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

    రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

    కాకినాడ రూరల్ – పంతం నానాజీ

  • 24 Feb 2024 12:04 PM (IST)

    సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పోటీ ఇలా..

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇక మిగిలిన స్థానాలకు టీడీపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది.

Published On - Feb 24,2024 11:55 AM

Follow us