TDP-Janasena: టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల.. లైవ్ వీడియో..
టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు ఆయా పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 118 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఫస్ట్ లిస్ట్‌లో ఎవరెవరికి టికెట్ దక్కబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు ఆయా పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 118 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఫస్ట్ లిస్ట్‌లో ఎవరెవరికి టికెట్ దక్కబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గుంటూరు వెస్ట్, రాజమండ్రి రూరల్, తెనాలి, తిరుపతి.. ఇలా కొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ నెలకొంది. ఆయా సీట్లపై రెండు పార్టీల నేతలూ గట్టిగా పట్టుబడుతున్నారు. దాంతో, వీటిలో టీడీపీకి ఎన్ని దక్కుతాయి? జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
ఫస్ట్ లిస్ట్ అనౌన్స్‌కి ముందు అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లి నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. అలాగే, మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. ఇక కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మినహా అందరికీ సీట్లు ఉన్నాయని అంచనా. అలాగే బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చాక మిగతా స్థానాలపై టీడీపీ, జనసేన చీఫ్‌లు కసరత్తు చేయనున్నారు.