Chandrababu: చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్.. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు

Chandrababu: చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్..  మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం
Chandrababu And Amit Shah
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 26, 2021 | 4:29 PM

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ లభించిన తర్వాత మరో మారు ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  ఇలాఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు రాష్ట్రంలో ప్రాయోజిత ఉగ్రవాదానికి పాల్పడుతోందని చంద్రబాబు నేతృత్వంలోని 7 గురు సభ్యుల టీడీపీ బృందం రాష్ట్రపతికి విన్నవించింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన చంద్రబాబు బృందం ఈ మేరకు ఫిర్యాదు చేసింది.

ఏపీలో రాష్ట్రపతి పాలనతోపాటు డీజిపీని రీకాల్‌ చేయాలని కూడా తెలుగుదేశం బృందం రాష్ట్రపతిని కోరింది. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కోరామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు.. ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఏపీ చిరునామాగా మారిందని చంద్రబాబు రాష్ట్రపతి ద‌ృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలోని ఏజెన్సీలలో దాదాపు 25 వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని, మద్యపాన నిషేధమని చెప్పి ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు. రాష్ట్రంలో మద్యం ప్రత్యేక బ్రాండ్లను సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడిందని.. మాదకద్రవ్యాలను అదుపుచేయాలని ప్రభుత్వాన్ని కోరితే, ఒకేసారి టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు.

ఈ వ్యవహారాలపై తగిన చర్యలు తీసుకోవాలని బృందం రాష్ట్రపతిని కోరింది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోపాటు, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏపీ లోని పరిస్థితులపై వివరించాలని భావించారు. అయితే, మోదీ, అమిత్ షా అపాంట్ మెంట్ చంద్రబాబుకు దొరకకపోవడంతో ఇప్పటికి ఏపీకి తిరుగు ప్రయాణమై, మరోమారు ఢిల్లీ వెళ్లి ఇరువుర్ని కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Read also:  Minister Anil Kumar Yadav: సీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు: మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!