AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తాడిపత్రిలో మరో సంచలనం.. వినూత్న కార్యక్రమం చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

Andhra Pradesh: ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో సంచలనాలు చేసే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తన కార్యక్రమంతో

Andhra Pradesh: తాడిపత్రిలో మరో సంచలనం.. వినూత్న కార్యక్రమం చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
Tadipatri Jc Prabhakar Redd
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2021 | 4:27 PM

Share

Andhra Pradesh: ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో సంచలనాలు చేసే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తన కార్యక్రమంతో చిరకాల ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. ఇంతకీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కార్యక్రమం ఏంటి? అంతలా పంచ్ ఏముందు? ఇప్పుడు తెలుసుకుందాం. జేసీ ప్రభాకర్ రెడ్డది తన ఇంటి వద్ద ఫ్రీడం డే పేరుతో సంబరాలు నిర్వహించారు. అదేంటి ఇవాళ ఆగష్టు 15 కాదు.. జనవరి 26 కూడా కాదు కదా అంటే.. మాకు ఇప్పుడే ఫ్రీడం డే వచ్చిందని సంబురాలు చేసుకున్నారు. ఎందుకంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జేసీ ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అప్పట్లో జరిగిన గొడవలు దాదాపు 15రోజుల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. అయితే ఈ సంఘటన తరువాత టీడీపీ కార్యకర్తలు యాక్టీవ్ అయ్యారు. వెంటనే వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. ఆ రోజు జరిగిన సంఘటన కారణంగానే తమ కార్యకర్తలు భయం వీడి.. మనో ధైర్యంతో ముందుకు వచ్చారని, దానికి గుర్తుగా ఫ్రీడమ్ డే సంబరాలు చేసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇంకా వింత ఏంటంటే.. ఈ వివాదానికి కారణం ఇసుక కావడంతో.. ఒక కేక్‌పై ఇసుక బండి వేయించారు. ఆ కేక్‌ను అభిమానులు, కార్యకర్తల సమక్షంలో జేసీ కక్ కట్ చేశారు. అనంతరం ఇంటి వద్ద బాణా సంచా కాల్చారు. అలాగే విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also read:

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

Telangana: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Omicron Alert: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అక్కడ రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..

‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్
దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్
కొత్త ఏడాది మీ రాశికి ఉన్న గ్రహ దోషాలను ఇలా పోగొట్టుకోండి..!
కొత్త ఏడాది మీ రాశికి ఉన్న గ్రహ దోషాలను ఇలా పోగొట్టుకోండి..!
ఓపెన్‌ ఫోర్స్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారా..? ఇలా ట్రై చేయండి..
ఓపెన్‌ ఫోర్స్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారా..? ఇలా ట్రై చేయండి..
జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
బిగ్‌ షాక్‌.. ఇకపై వారికి నో గ్రాట్యుటీ!
బిగ్‌ షాక్‌.. ఇకపై వారికి నో గ్రాట్యుటీ!