CJI NV Ramana: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంత ఊరికి.. జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు ఏపీ అధికారులు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో వచ్చారు. ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం..

CJI NV Ramana: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంత ఊరికి.. జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం..
Cji
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 24, 2021 | 1:39 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు ఏపీ అధికారులు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో వచ్చారు. ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో ఎన్వీ రమణ పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు.

అయితే అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్న సీజేఐకు అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ గరికపాడు వద్ద ఘన స్వాగతం లభించింది. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. వివిధ ప్రాంతాలకు చెందిన జడ్జీలు, విద్యార్థులు పుష్ప గుచ్చాలు ఇచ్చి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఎన్వీ రమణకు. సీజేఐ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

కృష్ణా జిల్లా సొంతూరులో ఇవాళ పర్యటిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి రమణ సూర్యాపేటలో కొంతసేపు ఆగారు. అక్కడే ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేశారు. అనంతరం హోటల్‌ సిబ్బందితో ఫోటోలు దిగారు. సూర్యాపేటకు వచ్చిన ఎన్‌.వి రమణకు జిల్లా జడ్జీలు జగ్జీవన్‌ కుమార్‌, వసంతపాటిల్‌, సురేష్‌, ప్రశాంతి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి స్వాగతం పలికారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నవరంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి రమణ పర్యటిస్తారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సొంతూరుకు వస్తుండడంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి: ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Conjoined Twins: వారు ఇద్దరు కాదు ఒక్కరు.. పంజాబ్ కుర్రాళ్లు ఉద్యోగం సాధించారు.. స్ఫూర్తిగా నిలిచారు..

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..