Andhra Pradesh: ప్రియురాలిని తీసుకెళ్లి రాత్రి వేళ ఇంటి దగ్గర వదిలిపెట్టాడంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రత్న మాధురి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ నెల 27న ప్రియుడు శేఖర్‌ను కలిసిన రత్న మాధురి.. అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు ప్రియుడు శేఖర్. అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రత్న మాధురి ఇవాళ మృతి చెందింది.
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రత్న మాధురి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ నెల 27న ప్రియుడు శేఖర్‌ను కలిసిన రత్న మాధురి.. అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు ప్రియుడు శేఖర్. అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రత్న మాధురి ఇవాళ మృతి చెందింది. యువతి తల్లిదండ్రులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రత్న మాధురి స్వస్థలం నర్సీపట్నం శారదా నగర్.. అయితే, గత కొన్ని నెలలుగా శేఖర్, రత్న మాధురి ప్రేమలో ఉన్నారు. ఈ నెల 27న ఇద్దరు కలుసుకున్నారు. అనంతరం ఆమె తీవ్ర అస్వస్థతకు గుర్వడంతో ఆమెపై విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పేరెంట్స్.. అలాగే ప్రియుడు శేఖరే ప్రాణాలు తీశాడంటూ ఆరోపిస్తున్నారు. అయితే, మాధురి తల్లి అమ్మాజీ ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు శేఖర్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుచేస్తున్నామని.. త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని.. నర్సీపట్నం పోలీసులు తెలిపారు.
తన కూతురిపై విష ప్రయోగం జరిగిందని.. శేఖరే రత్న మాధురి ప్రాణాలు తీశాడంటూ మాధురి తల్లి అమ్మాజీ పేర్కొన్నారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఏ ఆడబిడ్డకు జరగకూడదని.. శేఖర్ ను కఠినంగా శిక్షించాలని తల్లి అమ్మాజీ కన్నీరుమున్నీరయ్యారు. రత్న మాధురికి శేఖరే పాయిజన్ ఇచ్చి ఉంటాడని.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని మృతురాలి మామ సాయి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..