Bears: 3 ఎలుగుబంట్లు.. 3 గ్రామాలు.. ఉద్దానంల తోటల్లో కాపు కాసి బీభత్సం.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి,పగలు అన్న తేడా లేకుండా గ్రామాలలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. మనుషులపైనా, పశువులపైనా దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వజ్రపుకొత్తూరు మండలంలో గురువారం రెండు ఎలుగుబంటులు భీభత్సం సృష్టించాయి. ఎం.గడూరు, డెప్పూరు గ్రామాలలో ఎలుగుబంట్ల దాడుల్లో నలుగురు గాయపడ్డారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి,పగలు అన్న తేడా లేకుండా గ్రామాలలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. మనుషులపైనా, పశువులపైనా దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వజ్రపుకొత్తూరు మండలంలో గురువారం రెండు ఎలుగుబంటులు భీభత్సం సృష్టించాయి. ఎం.గడూరు, డెప్పూరు గ్రామాలలో ఎలుగుబంట్ల దాడుల్లో నలుగురు గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళo ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి తరలించారు. కుమారస్వామి అనే మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్ళి ఇంటికి వస్తుండగా తోటలో తిష్ట వేసిన రెండు ఎలుగుబంట్లు ఒక్కసారిగా అతనిపై పడి తీవ్రంగా గాయపరిచాయి. అదే సమయంలో కుక్కలు వచ్చి అరవటంతో అవి అక్కడ నుండి వెళ్ళిపోయాయి. వెంటనే స్థానికులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ఆ దాడి జరిగిన కాసేపటికే ఆ రెండు ఎలుగుబంట్లు పొరుగునే ఉన్న డెప్పూరు గ్రామంలోని తోటల్లో మళ్ళీ విరుచుకుపడ్డాయి. రేగిపళ్ళు కోస్తుండగా నారాయణమ్మ అనే మహిళపై రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ క్రమంలో మహిళ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నారాయణమ్మ, కుమారస్వామి హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన నుంచి తేరుకోకముందే మందస మండలం అల్లిమెరక గ్రామంలో ఎలుగుబంట్లు కలకలం రేపాయి. శనివారం ఉదయం అల్లిమెరక గ్రామంలోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హల్చల్ చేశాయి. ఇంతలో గ్రామస్తులు ఎలుగుబంట్లను గమనించి కేకలు వేశారు. ఇంతలో కుక్కలు కూడా ఎలుగుబంట్ల వెంటపడటoతో పారిపోయాయి. ఎలుగుబంట్ల సంచారంతో వ్యవసాయ పనులు నిమిత్తం తోటలు, పొలాల్లోకి వెళ్లాలంటే భయంతో రైతులు వణికిపోతున్నారు. ఎలుగుబంటులను బంధించి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే వన్య సంరక్షణ చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితులలో తప్ప వాటిని బంధించటం కుదరదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల్లోకి, తోటలలోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

