Andhra Pradesh: ఇంజినీరింగ్ విద్యార్థిని మరణం వెనుక మర్మం ఏమిటి..? హత్యా.. ప్రమాదమా..

రాత్రి వరకు బాగానే ఉన్న హారిక.. తెల్లారే సరికి అగ్నికి ఆహుతయింది. నిప్పు వెనుక నిజాలేంటి? ఆస్తి కోసం తండ్రి, పినతల్లి ఆమెను హత్య చేశారనే ఆరోపణలు సంచలనంగా..

Andhra Pradesh: ఇంజినీరింగ్ విద్యార్థిని మరణం వెనుక మర్మం ఏమిటి..? హత్యా.. ప్రమాదమా..
Representative Photo
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 14, 2022 | 9:37 PM

హారిక ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌… తండ్రి ముళ్లూడి శ్రీనివాస్‌… నాన్న అంటే ఆమెకు ఎంతో అభిమానం.ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ కొన్నాళ్లుగా వరుస మారిందనే ఆరోపణలు. అందుకు కారణం.. ఆమె.. భార్య చనిపోవడంతో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు హారిక తండ్రి. రూప అర్ధాంతర మరణంపై బంధుమిత్రుల్లో ఎన్నో అనుమానాలు. ఇంతలోనే మరో దారుణం…హారిక నిద్రిస్తోన్న గదిలో మంటలు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బంగారు తల్లి మంటల్లో ఆహుతి అయింది. దీనిని ప్రమాదం అని హరిక తండ్రిం అంటే.. ఈ ఘటన వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్తు సర్క్యూట్‌ వల్లే ప్రమాదవశాత్తు ఈ దారుణం జరిగిందన్నారు హారిక తండ్రి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌ను పరిశీలించారు. స్థానికులు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అయితే హారికది ముమ్మాటికీ పక్కా ప్లాన్డ్‌ మర్డరేనన్నారు మేనమామ. ఆమె తండ్రి, సవతి తల్లి కలిసి ఆస్తి కోసమే హారికను హత్య చేశారని ఆరోపించారు.

బంధువుల ఆరోపణల క్రమంలో శ్రీనివాస్‌, అతని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బంధువులు ఆరోపిస్తున్నట్టు హారికను సజీవదహనం చేసి ప్రమాదవశాత్తుగా వక్రీకరిస్తున్నారా.. విద్యుద్ఘాతం వల్లే ఈ దారుణం జరిగిందా అనేది నిర్థారించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. రాత్రి వరకు బాగానే ఉన్న హారిక.. తెల్లారే సరికి అగ్నికి ఆహుతయింది. నిప్పు వెనుక నిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఆస్తి కోసం తండ్రి, పినతల్లి ఆమెను హత్య చేశారనే ఆరోపణలు మాత్రం సంచలనంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?