Suspension: ఐరాల ట్రైనీ ఎస్‌ఐపై వేటు.. వినాయక చవితి వేడుకలకు సంబంధించి.. అనధికారిక సమాచారాన్ని పోస్ట్ చేశాడని..
SI Suspension In AP: వినాయక చవితి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఏపీలో వినాయక చవితి వేడుకలు రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరగడం..

SI Suspension In AP: వినాయక చవితి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఏపీలో వినాయక చవితి వేడుకలు రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరగడం, దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మూడో రాష్ట్రంగా ఏపీ ఉన్న నేపథ్యంలో పండుగపై ఆంక్షలు విధించామని.. ఈ ఆంక్షలు కేవలం వినాయక చవితికే కాదని, ఇతర మతాల పండుగలపై కూడా ఉంటుందని ఓ వైపు వైసీపీ ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్ర పురితంగానే వినాయక చవితిపై ఆంక్షలు విధిస్తుందని విమర్శిస్తున్నారు. అయితే కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేవలం బహిరంగ వేడుకలకు అనుమతి నిరాకరించామని ఇళ్లలో వేడుకలు జరుపుకోవచ్చని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి వేడుకల విషయంలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించిదంటూ చిత్తూరు జిల్లాలోని ఐరాల ట్రైనీ ఎస్‌ఐ లోకేష్ ఓ అనధికారిక సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు ట్రైనీ ఎస్‌ఐ లోకేష్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయమై చిత్తూరు జిల్లా పోలీసులు ట్వీట్ చేస్తూ.. ‘వినాయక చవితి వేడుకలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను లోకేష్‌పై సస్పెన్షన్ విధించాము’ అంటూ పేర్కొన్నారు.
Sri S.Lokesh, trainee SI of Irala PS has been put under suspension for issuing an unauthorised memo concerning Vinayaka Chaviti celebrations in a negligent manner. @APPOLICE100 @dgpapofficial@ChittoorPolice @somuveerraju @BJP4Andhra
— Chittoor District Police (@ChittoorPolice) September 7, 2021
టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబెట్‌తో వెలుగులోకి..
ఇదిలా ఉంటే అసలు ట్రైనీ ఎస్‌ఐ లోకేష్ పోస్ట్ చేసిన సమాచారం టీవీ9 నిర్వహించిన ‘బిగ్ న్యూస్ బిగ్ డిబెట్’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చింది.
వెలుగులోకి రావడానికి కారణం టీవీ9 నిర్వహించిన ‘బిగ్ న్యూస్ బిగ్ డిబెట్ విత్ రజీనికాంత్’ కార్యక్రమం. ఏపీలో వినాయక చవితి చుట్టూ జరుగుతోన్న రాజకీయాన్ని ప్రధాన అంశంగా సోమవారం నిర్వహించిన ఈ డిబెట్‌లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎస్సై లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాపీని చదివి వినిపించారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకున్న పోలీసు అధికారులు ఎస్సై లోకేష్‌పై చర్యలు తీసుకున్నారు. ఎస్సై లోకేష్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులో ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
YSRTP: ఏడేళ్ల పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది.. వెంటనే రాజీనామా చేయాలి: వైయస్ షర్మిల
PAN Card: కేవలం పది అంటే పది నిమిషాల్లో పాన్ కార్డ్ పొందవచ్చు.. ఇదెలా సాధ్యమో తెలుసా?