Kodali nani: ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది: మంత్రి కొడాలి నాని

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 07, 2021 | 9:28 PM

ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ.. దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

Kodali nani: ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది: మంత్రి కొడాలి నాని
Kodali Nani

Follow us on

Ganesh Festival in AP: ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ.. దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కాషాయరంగు, దేవుడి బొమ్మలను అడ్డం పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. వినాయక చవితి పందిర్ల వద్ద ఉండే జనంలో 10 శాతం కూడా బీజేపీ దగ్గర ఉండరని, ఏపీలో బీజేపీ గురించి, సోము వీర్రాజు గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు కొడాలి నాని.

వినాయక చవితి ఉత్సవాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఏపీలో అమలు చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాలని సూచించడం జరిగిందని మంత్రి కొడాలి నాని అన్నారు. వినాయక చవితి దేశం మొత్తం జరిగే పండగ అని, ఉత్సవాలకు అనుమతిస్తే కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుందని కేంద్రం కొన్ని నిబంధనలు తీసుకువచ్చిందన్నారు. ఆ నిబంధనల ప్రకారమే వినాయక చవితి జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు.

దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే, చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ శవాలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని నాని విమర్శించారు. శవ రాజకీయాలు చేయడానికి తుప్పు, పప్పులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవాలని మాట్లాడుతున్న చంద్రబాబు.. థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తే అప్పుడేం మాట్లాడతారు..? అని నాని ప్రశ్నించారు.

Read also: YSRTP: ఏడేళ్ల పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది.. వెంటనే రాజీనామా చేయాలి: వైయస్ షర్మిల

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu