AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంలో మెన్షన్‌ చేసిన చంద్రబాబు లాయర్.. మంగళవారం మరోసారి చేయాలన్న సీజేఐ డివై చంద్రచూడ్

Chandrababu Quash Petition: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్టు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఓకే చేసింది. అయితే మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ డివై చంద్రచూడ్. చంద్రబాబు సుప్రీంకోర్టులో..

Chandrababu: క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంలో మెన్షన్‌ చేసిన చంద్రబాబు లాయర్.. మంగళవారం మరోసారి చేయాలన్న సీజేఐ డివై చంద్రచూడ్
Chandrababu Naidu
Sanjay Kasula
| Edited By: |

Updated on: Sep 25, 2023 | 1:03 PM

Share

ఢిల్లీ, సెప్టెంబర్ 25: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్టు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఓకే చేసింది. అయితే మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ డివై చంద్రచూడ్. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది.. అక్కడ ప్రతిపక్షాలను అరికట్టారు … సెప్టెంబర్ 8 న అరెస్టు చేశారు. అయితే, ఈ రోజు ప్రస్తావనకు అనుమతించడానికి CJI మొగ్గు చూపలేదు. ప్రస్తావన జాబితాలోకి రేపు రావాలని లూథ్రాను కోరారు. చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా సుప్రీంకోర్టును కోరారు. అయితే, రేపు మరోసారి మెన్షన్‌ చేయాలని సీజే సూచించారు.

సీఐడీ కస్టడీ ముగిసినా… చంద్రబాబు మరో 11 రోజులు జైల్లోనే ఉండనున్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించింది. అక్టోబర్‌ 5 వరకు రిమాండ్‌ను పొడిగించారు. రెండు రోజుల విచారణ ముగిశాక…ఆయనను ఏసీబీ కోర్టు జడ్జి ముందు సీఐడీ అధికారులు వర్చువల్‌గా హాజరు పరిచారు.ఈ సందర్భంగా విచారణ సమయంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా, సీఐడీ అధికారులు బెదిరించారా అని చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు.

అలాంటిది ఏమీ లేదని బాబు చెప్పారు. తానే నేరం చేయలేదని, విచారణకు పూర్తిగా సహకరించానని జడ్జికి తెలిపారు బాబు. మీపై 2 వేల పేజీలకు పైగా 600 అభియోగాలున్నాయని చంద్రబాబుతో న్యాయమూర్తి అన్నారు. అభియోగ పత్రాలను చంద్రబాబు లాయర్లకు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని జడ్జి తెలిపారు. ఇక ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్‌ స్కామ్‌లకు సంబంధించి రెండు పీటీ వారంట్లపై కూడా సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం