Tirupati Laddu: ప్రాథమిక ఆధారాలే లేవు.. మీడియా ముందుకు ఎందుకెళ్లారు?.. సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక వైపు సిట్ (SIT) దూకుడు పెంచగా, మరో వైపు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సమవారం హాట్ హాట్ గా విచారణ కొనసాగింది.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా..? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది..
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.. ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక వైపు సిట్ (SIT) దూకుడు పెంచగా, మరో వైపు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సమవారం హాట్ హాట్ గా విచారణ కొనసాగింది.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా..? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని.. ప్రభుత్వ న్యాయవాది లూథ్రా వివరించారు.. తయారైన లడ్డూలని టెస్టింగ్‌కు పంపించారా..? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా.. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా….? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తికాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి.. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూ తయారుచేసినట్లు ప్రాథమిక ఆధారాలు లేవంటూ ధర్మాసనం పేర్కొంది.
మీడియా ముందుకు ఎందుకెళ్లారు?..
విచారణ జరపకముందే అలాంటి ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని.. తిరస్కరించిన నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించినట్టు ఆధారాలే లేవని.. జంతువుల కొవ్వును వినియోగించినట్లు.. కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా..? అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చెబుతన్న ల్యాబ్ రిపోర్ట్- తిరస్కరించిన శాంపిల్‌ది కాదా..? మీరు సిట్ విచారణకు ఆదేశిస్తే మీడియా ముందుకు ఎందుకెళ్లారు? దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాం.. జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో మీడియా ముందుకు ఎందుకెళ్లారు? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
ఏపీ సీఎం ప్రకటన విరుద్ధంగా ఉంది..
సుబ్రహ్మణ్యస్వామి తరుపు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యిట్యాంకర్‌ని అనుమతించలేదని టీటీడీ చెబుతోందన్నారు రాజశేఖర్ రావు.. టీటీడీ చెప్పినదానికి ఏపీ సీఎం ప్రకటన విరుద్ధంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే.. ట్యాంకర్ లోపలికి వెళ్లదని టీటీడీ చెబుతోందని తెలిపారు. శాంపిల్స్‌ని ఎక్కడనుంచి సేకరించారు.. తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా? అంటూ పేర్కొన్నారు. ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా?ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. కల్తీ నెయ్యి ఎన్నడూ వాడలేదని టీటీడీ అధికారి చెప్పారంటూ రాజశేఖర్ రావు కోర్టుకు విన్నవించారు. టీటీడీ అధికారి ఐఏఎస్సా?- ప్రసాదంపై అనుమానాలు ఉంటే దర్యాప్తు చేయాలి సరైన ఆధారాలు లేకుండా ప్రసాదం కలుషితమైందని ప్రకటించడం ఆందోళనకరంగా ఉందని.. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉంటుంది? ఈరోజు మతం కావచ్చు.. రేపు మరేదైనా కావచ్చు..అంటూ తెలిపారు.