Andhra: బుద్దిమంతుడిలా ఉన్నాడనుకునేరు కన్నింగ్ కంత్రీగాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే
పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తీని చూసి అమాయకుడు అనుకునేరు.. పక్కా మోసగాడు తిరుమల భక్తులను దారుణంగా మోసం చేశాడు. మరి అతడు ఎవరు.? ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి. ఆ వివరాలు..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఫేస్‌బుక్ అకౌంట్స్‌లోనూ ఫేక్ శ్రీవారి సేవా టికెట్స్ అమ్మే కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త. భక్తుల అవసరాలు ఆసరాగా చేసుకుని దగా చేస్తున్న కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోతుండటంతో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే తిరుమలలో దళారీ అరెస్ట్ జరిగింది. సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసిన దళారీ వ్యవహారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా వెంగలాయపాలెంకు చెందిన హరి నాగసాయి కార్తీక్‌ను అరెస్టు చేసిన తిరుమల వన్ టౌన్ పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. శ్రీ ప్రభాకరాచార్యులు పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి మోసానికి పాల్పడ్డ కార్తీక్ గత కొంతకాలంగా భక్తులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. తిరుమలలో సహాయ అర్చకుడునని బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవా టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించి మోసం చేసిన కార్తీక్ కేటుగాడి అవతారం ఎత్తినట్లు తేల్చారు.
తిరుపతికి చెందిన విజయ్ అనే భక్తుడికి 4 సుప్రభాత సేవ టికెట్లు ఇస్తానని రూ. 70,700 తీసుకున్న కార్తీక్.. ఆదిత్య, హరికృష్ణ, నాగార్జున అనే మరో ముగ్గురు సహాయంతో బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బు కాజేసినట్లు తేల్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ 1.03 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా భక్తులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. కార్తీక్‌పై తిరుమలలో రెండు కేసులు, తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో ఒక కేసు నమోదు అయినట్లు తెలిపారు. గతంలో 16 మంది ఎన్నారై భక్తులకు అభిషేకం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి రూ.36 లక్షలు కాజేసిన కార్తీక్ నేరచరిత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే శ్రీవారి టికెట్లను ఇప్పిస్తానంటూ మోసం చేసిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి కార్తీక్ మళ్ళీ అదే రీతిలో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




