- Telugu News Photo Gallery Multibagger Penny stock under Rs 10 in focus after board approves 1:10 bonus issue and 10:1 stock split
ఇది కదా అద్దిరిపోయే ఆఫర్ బాబాయ్.! 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ.. ధనవంతులను చేసే స్టాక్ ఇది
Multibagger Stock: రూ. 10 కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న ఈ స్టోక్ మీకు ఫ్రీగా షేర్స్ ఇస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీ దగ్గర ఈ స్టాక్ కు సంబంధించి 100 షేర్లు ఉంటే.. మరో 1000 షేర్లు మీ సొంతం. మరి ఆ స్టోక్ ఏంటంటే
Updated on: Sep 05, 2025 | 6:12 PM

ప్రముఖ ఫార్మా కంపెనీ వెల్క్యూర్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తమ ఇన్వెస్టర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఆగష్టు 22న జరిగిన డైరెక్టర్ల సమావేశంలో బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్‌లపై ఆమోదముద్ర వేసింది. షేర్ల లిక్విడిటీని పెంచడంతో పాటు వాటాదారుల హోల్డింగ్‌ను విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మొదటిగా 1:10 బోనస్ షేర్లలో భాగంగా ప్రతీ ఒక్క అర్హత కలిగిన ఈక్విటీ వాటాదారులు 10 షేర్లకు ఓ బోనస్ షేర్ పొందనున్నారు. అలాగే 10:1 స్టాక్ స్ప్లిట్ గానూ రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేర్‌ను రూ. 1 ఫేస్ వాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లుగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం బోర్డు ఆమోదం తెలిపిన డేట్ నుంచి రెండు లేదా మూడు నెలల్లో పూర్తి కానుంది.

అంటే.! ఉదాహరణకు మీ దగ్గర ఈ కంపెనీకి సంబంధించి 100 షేర్లు ఉన్నట్లయితే.. మొదటిగా స్ప్లిట్ ప్రకారం అవి 1000 షేర్లు(100*10) కానున్నాయి. ఆ తర్వాత బోనస్ ప్రకారం ఆ 1000 షేర్లు.. (1000+100)1100 షేర్లు అవుతాయి.

ఇక కంపెనీ విషయానికొస్తే.. ఆగష్టు 22 నాటికి ఈ కంపెనీ నికర క్యాపిటల్ రూ. 186 కోట్ల నుంచి రూ. 196 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. అలాగే కంపెనీ తన Q1FY26 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆదాయం Q1FY26లో రూ. 299.91 కోట్లకు పెరిగింది.

ఇది Q4FY25లో రూ. 21.21 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 1300 శాతం వృద్ధిని సూచించింది. నికర లాభం Q4FY25లో రూ. 2.50 కోట్ల నుంచి రూ. 23.29 కోట్లకు పెరిగింది. ఇది 830 శాతం పెరుగుదలను సూచిస్తోంది. గతంలో, కంపెనీ మొత్తం రూ. 299.91 కోట్ల విలువైన ఏడు ఎగుమతి-సోర్సింగ్ అసైన్‌మెంట్‌లను పూర్తి చేసింది. ఇన్వెంటరీ లేదా లాజిస్టిక్స్ ఎక్స్‌పోజర్ లేకుండా స్థిర కమిషన్ ఆదాయాన్ని ఆర్జించింది.

1992లో స్థాపించబడిన వెల్క్యూర్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ ఔషధ సంస్థ.ఇది విస్తృతంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఔషధాల తయారు చేస్తోంది. నాణ్యత, నమ్మకంతో వెల్క్యూర్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 10 కింద ట్రేడ్ అవుతోంది. కాగా, స్టాక్ మార్కెట్ అనేది రిస్క్‌తో కూడుకున్నది.. కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కచ్చితంగా బిజినెస్ అడ్వైజర్ సలహాలను పాటించండి.




