ఏ బ్రాండ్ తాగి కొట్టావ్ బ్రో.! 43 ఫోర్లు, 12 సిక్సర్లతో చరిత్ర చూడని మాస్ ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు బద్దలు
ఓ కొహ్లి.. ఓ సచిన్.. ఓ ఆమ్లా.. ఓ రికీ పాంటింగ్.. ఇలా కొందరు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆగమనం గుర్తుండిపోతుంది. సరిగ్గా ఈ ఆటగాళ్ల కోవలోకి వస్తాడు యువ దక్షిణాఫ్రికా బ్యాటర్. ఇతగాడి అనుభవం కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే కట్ చేస్తే..! వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేలలో చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని చరిత్ర పుస్తకాల్లో లిఖించాడు దక్షిణాఫ్రికా యువ బ్యాటర్. ఈ 26 ఏళ్ల దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్.. పురుషుల వన్డే చరిత్రలో తన మొదటి ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్ ఆరంభంలో మొదటి నాలుగు వన్డేలలో నాలుగుసార్లు అర్ధ సెంచరీలు సాధించిన భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రికార్డును అధిగమించాడు. లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే ఈ ఘనతను నమోదు చేశాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 77 బంతుల్లో 85 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన మాథ్యూ బ్రీట్జ్కే.. తన తొలి 5 వన్డేలలోనూ ఐదు హాఫ్ సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీట్జ్కే.. తొలి మ్యాచ్‌లో 150 పరుగులు, ఆ తర్వాత పాకిస్థాన్‌పై 83 పరుగులు, ఆపై ఆస్ట్రేలియాతో జరిగిన వరుస మ్యాచ్‌లలో 57, 88 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్ మ్యాచ్‌లో 85 పరుగుల ఒంటరి పోరాటం చేశాడు. ఇలా ODIలలో వరుసగా ఐదు యాభైకి పైగా స్కోర్లు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ఎలైట్ గ్రూప్‌లో మాథ్యూ బ్రీట్జ్కే చోటు సంపాదించాడు.
జాంటీ రోడ్స్ తొలిసారిగా 2000–01లో ఈ ఘనతను సాధించగా, ఆ తర్వాత 2017, 2019లో రెండుసార్లు క్వింటన్ డికాక్.. 2024–25లో హెన్రిచ్ క్లాసెన్ ఈ ఘనతను సాధించారు. ఇక ఇప్పుడు మాథ్యూ బ్రీట్జ్కే ఈ రికార్డును సాధించి దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. కాగా, ఇప్పటివరకు బ్రీట్జ్కే ఐదు వన్డేలు ఆడి.. 463 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు 1 సెంచరీ ఉన్నాయ్. అలాగే మనోడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 150గా ఉంది.
Most runs after five innings in men’s ODIs:
𝟰𝟲𝟯 – 𝗠𝗮𝘁𝘁𝗵𝗲𝘄 𝗕𝗿𝗲𝗲𝘁𝘇𝗸𝗲 🇿🇦 374 – Tom Cooper 🇳🇱 328 – Allan Lamb 🏴 316 – Sunil Ambris 🏝️ 309 – Temba Bavuma 🇿🇦 pic.twitter.com/YCqMn9Tpni
— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








