AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పురిటి నొప్పులతో అస్పత్రికొచ్చిన గర్భవతి.. కడుపులో ఉన్న పిండం ఎక్స్‌రే తీయగా

ఓ గర్భవతికి పురిటినొప్పులు వచ్చాయని కంగారుగా ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబీకులు. అయితే అక్కడున్న డాక్టర్లు పిండం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్ రే తీయగా.. అది చూసి వాళ్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: పురిటి నొప్పులతో అస్పత్రికొచ్చిన గర్భవతి.. కడుపులో ఉన్న పిండం ఎక్స్‌రే తీయగా
X Ray
Ravi Kiran
|

Updated on: Sep 02, 2025 | 9:02 AM

Share

ఓ 26 ఏళ్ల గర్భవతిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకొచ్చారు ఆమె కుటుంబీకులు. తనకు కడుపునొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో పురిటి నొప్పులేమో అని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక అక్కడి వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయగా.. ఆమె కడుపులో పెరుగుతున్న పిండం చుట్టూ పెద్ద తిత్తి పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేసరికి 34 వారాల గర్భవతిగా ఉంది.

ఆమెకు ఆరు వారాల క్రితం అల్ట్రాసౌండ్ స్కాన్ జరిగింది. అందులో అండాశయ తిత్తి ఉన్నట్లు గుర్తించారు. అది ఆమెకు 18వ వారంలో మాత్రమే కనబడింది. గర్భాశయంలోని ఒక భాగంలో పిండం పెరుగుతుండగా.. ఇంకో భాగాన్ని ఈ భారీ తిత్తి కప్పేసినట్టు డాక్టర్లు కనుగొన్నారు. అంతేకాకుండా దీని వల్ల శిశువు పెరుగుదల క్షీణించడం ప్రారంభమైందని వైద్యులు తేల్చారు. సరిగ్గా ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మూడు రోజులకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించాడు. మొదటిగా 5 పౌండ్ల బరువున్న శిశువును ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు తీయగా.. ఆ తర్వాత ఎడమ అండాశయాన్ని కప్పేసిన ఆ తిత్తిని తొలగించారు డాక్టర్లు. అందులో నుంచి 11 లీటర్ల ద్రవం వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఇది 35 సెం.మీ వ్యాసం కలిగి ఉంది. ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్న డాక్టర్ సిప్టో మంగున్‌కుసుమో ఆసుపత్రిలో చికిత్స పొందిన తల్లి ఆశ్చర్యకరంగా.. త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకుండా డిశ్చార్జ్ అయింది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..