Viral: కరెంట్ బిల్లు చూసి అతగాడి కళ్లు బైర్లు కమ్మాయ్.. ఎంతొచ్చిందో తెలిస్తే బిత్తరపోతారు
తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఓ కార్మికుడికి సుమారు రూ. 1.61 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో అతడు దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

తిరునెల్వేలి జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది.. కరెంట్ మీటర్ రీడింగ్ తీయగా.. బిల్లు ఏకంగా రూ. 1.61 కోట్లు ఇవ్వడంతో దెబ్బకు షాక్ అయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఇంతటి విద్యుత్ బిల్లు వచ్చిందని.. వెంటనే దీనిని సాల్వ్ చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లై జిల్లాలోని ముక్కురైపట్టి విద్యుత్ బోర్డు సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతంలో మరుధకుళం అనే గ్రామం ఉంది. మరియప్పన్ అనే కార్మికుడు తన కుటుంబంతో ఇక్కడ నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం, విద్యుత్ అధికారులు బిల్లును లెక్కించడానికి అతని ఇంటికి రాగా.. ఏకంగా కోట్లలో రావడం జరిగింది.
సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎంఎంఎస్ చూడగా.. మరియప్పన్ దెబ్బకు షాక్ అయ్యాడు. అందులో విద్యుత్ బిల్లు రూ. 1,61,31, 281 అని ఉంది. దీనితో షాక్‌కు గురైన మరియప్పన్, అతని కుటుంబం ఇంతటి విద్యుత్ బిల్లు రావడం ఏంటని అధికారులను ప్రశించారు. మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉండే తమ ఇంటికి ఇంత పెద్ద మొత్తం రావడం తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. కాగా, మరియప్పన్ వెంటనే మూకకరయిపట్టి విద్యుత్ బోర్డు కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేయగా.. సాంకేతిక లోపం కారణంగా ఇది జరిగిందన్నారు. అదే సమయంలో, లోపాన్ని సరిదిద్దుతామని, సరైన బిల్లును అప్‌లోడ్ చేస్తామని హామీ ఇచ్చారు. తదనుగుణంగానే విద్యుత్ బిల్లును సవరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




