Stenography Course: మే5 నుంచి స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 5వ తేదీ నుంచి స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ కె భాగ్యలక్ష్మి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 5వ తేదీ నుంచి స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ కె భాగ్యలక్ష్మి తెలిపారు. మే 5 నుంచి వరుసగా 28 పని రోజుల్లో ఈ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ కె భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చన్నారు. సందేహాలకు కోర్సు కన్వీనర్ డి రాజ్యలక్ష్మి ఫోన్ నంబరు 70328 67645 ద్వారా సంప్రదించాలని ఆమె సూచించారు. ఇతర వివరాలు
ఇవి కూడా చదవండి
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.