AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడి దారుణ హత్య.. సగం కాలిపోయిన మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి..

బీహార్‌లో ఘోర సంఘటన జరిగింది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం సగం కాలిన స్థితిలో గోనే సంచిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

యువకుడి దారుణ హత్య.. సగం కాలిపోయిన మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి..
Bihar Crime
Srilakshmi C
|

Updated on: May 02, 2023 | 10:35 AM

Share

బీహార్‌లో ఘోర సంఘటన జరిగింది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం సగం కాలిన స్థితిలో గోనే సంచిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌ గోపాల్​గంజ్​జిల్ల గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నట్వాన్ గ్రామానికి చెందిన సాహెబ్​ అన్సారి (27) అనే వ్యక్తి వృత్తి రిత్యా టైలర్. సాహెబ్​ ఏప్రిల్​26 రాత్రి భోజనం చేసి పడుకునేందుకు మేడపైకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఎంతకూ కిందకి రాకపోవడంతో తండ్రి అన్సారీకి అనుమానం కలిగింది. దీంతో మేడ పైకి వెళ్లి చూడగా సాహెబ్ కనిపించకపోవడంతో పనిమీద బయటకు వెళ్లాడేమో అనుకున్నాడు. రాత్రి చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఆచూకీ లభించని కారణంగా స్థానిక పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీపుర్ ఓపీ ప్రాంతంలోని భగవాన్‌పుర్ గ్రామం సమీపంలో ఓ కాలువ వద్ద గోనె సంచిలో నుంచి దుర్వాసన రావటాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు.

అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు గోనే సంచి తెరచి కూడగా లోపల సగం కాలిన మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం 5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాహెబ్​దేనని గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఓ సిమ్​కార్డు, మోమొరి కార్డు, ఓ మహిళ పోటో లభ్యమైంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమేమోననే కోణంలో కూడా పోలీసుల విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?