Srikakulam: మనిషి కంటే ఎంతో మేలు.. దూరమైన కుక్కకు పెద్ద ఖర్మ.. జంతు ప్రేమికుల ప్రశంసలు
సమాజంలో నమ్మదగిన జీవి ఏదైనా ఉందండే.. అది ఖచ్చితంగా కుక్కే. బుక్కెడు బువ్వ పెడితే.. యజమానిని ఎల్లవేలలా రక్షించుకుంటుంది. అందుకే శునకాలపై అంతే ప్రేమను కలిగి ఉంటారు కొందరు.
సాధారణంగా కుటుంబసభ్యులు మృతిచెందితే కర్మకాండలు చేస్తారు. పెద్దకర్మ నిర్వహిస్తారు. నలుగురిని పిలిచి భోజనాలు పెడతారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో నెయ్యిల నారాయణరావు అనే ఓ జంతు ప్రేమికుడు తాము ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోతే.. దాన్ని కూడా కుటుంబ సభ్యుడిలా భావించి కర్మకాండలు నిర్వహించారు. తన స్వగ్రామమైన నరసన్నపేటలోని హనుమాన్‌నగర్‌లో బుధవారం కర్మకాండలు, పెదకర్మ నిర్వహించి తమకున్న మానవత్వం చాటుకున్నారు.
నారాయణ రావుకి కుక్కల పెంచడం అలవాటు. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజు పెంచుతున్న కుక్క మృతి చెందింది. శాస్త్రోక్తంగా దానికి అంత్యక్రియలు పూర్తిచేసి.. బుధవారం 12వ రోజు పెదకర్మ చేశారు. అర్చకులతో పూజలు చేయించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టారు. మానవ జీవితంలో ఎవరైనా మరణిస్తే రక్త సంబంధికులే మరచిపోయే ఈ రోజుల్లో.. ఇలా కుక్కకు కూడా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కుటుంబంపై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజంగానే ప్రజంట్ జనరేషన్ పెట్ డాగ్స్‌ను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతుంది. అవి చూపించే విశ్వాసం అలాంటిది. కల్మషం ఉండదు. కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు.. ప్రాణాలు కూడా ఇచ్చేస్తాయి. రక్త సంబంధీకులే మోసం చేస్తున్న ఈ రోజుల్లో అవి చాలా బెటరే కదా..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..