Andhra News: అయ్యో పాపం.. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు!.. మనస్థాపంతో విద్యార్థిని..
ఓవైపు ఆకతాయి వేధింపులు.. మరోవైపు సమస్య చెప్తే పోలీసులు రెస్పాండ్ అవ్వలేదని మనస్థాపం.. ఈ రెండు కారణాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తనను వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మనస్థాపానికి గురైన స్పందన అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.

తనను వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మనస్థాపానికి గురైన స్పందన అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నేకొత్తపల్లికి చెందిన విద్యార్థిని స్పందన ధర్మవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుంది. అదే కళాశాలకు చెందిన వంశీకృష్ణ అనే ఆకుతాయి ధర్మవరంలో బస్సు ఎక్కే సమయంలో విద్యార్థినితో వెకిలి వేషాలు వేశాడు. కొపంతో ఊగిపోయిన విద్యార్థిని ఆకతాయి వంశీకృష్ణ చెంప చెళ్ళుమనిపించింది. దీంతో వంశీకృష్ణ తిరిగి ఇంటర్ విద్యార్థిని స్పందనపై చేయి చేసుకున్నాడు.
దీంతో స్పందన వంశీకృష్ణ తీరుపై ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. బస్సులో గొడవ జరిగింది తమ పరిధిలోకి రాదని.. చెన్నే కొత్తపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని దర్మవరం పోలీసులు తెలిపారు. దీంతో చెన్నే కొత్తపల్లి పీఎస్‌కి వెళ్లిన స్పందన అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వంశీకృష్ణ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కోరింది. వెంటనే వంశీకృష్ణను పిలిపించి మందలించాలని డిమాండ్ చేసింది. అయితే కంప్లైంట్ ఇచ్చారు కదా.. ఇక మీరు వెళ్లండి.. మేము చూసుకుంటామని పోలీసులు చెప్పినట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దీంతో తన సమస్యపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని మనస్తాపానికి గురైన స్పందన నేరుగా ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న కూతుర్ని చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వారం రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన స్పందన.. తాజాగా ప్రాణాలు విడిచింది.
అయితే వంశీకృష్ణ విషయంలో తాము సకాలంలోనే స్పందించామని.. ఇంటర్ స్పందన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వంశీకృష్ణపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. వంశీకృష్ణ కూడా మైనర్ అవడంతో జువైనల్ హోమ్‌కు తరలించామని పోలీసులు వివరణ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
