Kurnool district: ఉడుత చేసిన చిన్న పని… రెండు మూగజీవాలు బలి.. ఏం జరిగిందంటే

ఓ ఉడుత చేసిన చిన్న పొరపాటు కారణంగా రెండు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రైతు వ్యవసాయానికి సాయంగా ఉంటున్న ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి.

Kurnool district: ఉడుత చేసిన చిన్న పని... రెండు మూగజీవాలు బలి.. ఏం జరిగిందంటే
Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 20, 2021 | 1:05 PM

ఓ ఉడుత చేసిన చిన్న పొరపాటు కారణంగా రెండు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నోరులేని ఎద్దులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు.. ఓ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అవును.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాల పాలైన ఆ బాలుడు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..  ప్యాపిలి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడు జగదీశ్‌ ఎడ్ల బండిపై పొలానికి బయలుదేరాడు. పొలానికి వెళ్లే దారిలో 11 కేవీ విద్యుత్‌ తీగ తెగి పడి ఉండటాన్ని గమనించకుండా బండిని వెళ్లనిచ్చాడు. విద్యుత్‌ తీగ ఎద్దులకు తగలగానే అవి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. బండిపై ఉన్న జగదీశ్‌ సైతం షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బండి వెనుక వస్తున్న బాలుడి పెద్దనాన్న గమనించి బాలుడిని కాపాడాడు. తీవ్రంగా గాయపడిన జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరెంట్‌ స్తంభంపై ఒక ఉడుత తీగలను కొరకడంతో.. ప్రమాదవశాత్తు తెగి కింద పడినట్లు ట్రాన్స్‌కో ఏఈ వినయ్‌ కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు.

ishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు

Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?