SCR: ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఆ నగరాల మధ్య స్పెషల్ ట్రైన్స్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే(RRB) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే...
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే(RRB) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు(South Central Railway) విడుదల చేశారు. ఆయా రైళ్లను నడిపే తేదీలతో పాటు బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను ఇందులో పేర్కొన్నారు. గతంలో కొన్ని రైళ్లను ప్రకటించగా.. తాజాగా మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించారు. తిరుపతి – సేలం, సికింద్రాబాద్ – షాలిమార్ మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. నంబర్ 07675/07676 గల తిరుపతి-సేలం, 07441 నంబర్ గల సేలం-తిరుపతి, 12న తిరుపతి-సేలం , 13న సేలం-తిరుపతి (07442), 13న షాలిమార్-సికింద్రాబాద్ (08025), 16న సికింద్రాబాద్-షాలిమార్ (08026), 14న షాలిమార్-సికింద్రాబాద్ (08035), 17న సికింద్రాబాద్-షాలిమార్ (08036) రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
RRB Examination Specials @drmgtl @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/5TG15WAp70
ఇవి కూడా చదవండి— South Central Railway (@SCRailwayIndia) June 10, 2022
తిరుపతి – సేలం, సేలం – తిరుపతి..
తిరుపతి – సేలం మధ్య తిరిగే రైలు చిత్తూరు, కాట్పాడి, జోలార్పెట్టై స్టేషన్ లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సేలం – తిరుపతి రైలు జోలార్పెట్టై, కాట్పాడి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్ – షాలిమార్, షాలిమార్ – సికింద్రాబాద్ రైలు
సికింద్రాబాద్ నుంచి షాలిమార్ బయల్దేరే సమయంలో ఈ రైలు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్ పుర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పుర్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు.. ఖరగ్ పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్ పుర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి