Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona మూస్కులు ధరించకపోతే ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న కేసులతో ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నందున కేసుల...

Delhi Corona మూస్కులు ధరించకపోతే ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
Corona
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 11, 2022 | 6:23 AM

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న కేసులతో ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నందున కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు గుర్తించారు. భౌతిక దూరం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వంటివి కేసుల పెరుగుదలకు కారణమవుతుందని వెల్లడించారు. కాగా.. కరోనా సోకిన వారు రెండు, మూడు రోజుల్లో కోలుకోవడం శుభసూచకం. కొందరిలో జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు సమస్య లేకపోవడంతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఆరోగ్యం బాగా క్షీణిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం సెలవులు ఉండటంతో పలువురు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇది కేసుల పెరుగుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్నారు. అందుకే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని చెబుతున్నారు. ఢిల్లీలో గురువారం 622 మందికి వైరస్‌ సోకింది. రెండు మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.17 శాతం ఉండగా.. పది రోజుల్లోకే కేసులు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు.. తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసులు అధికంగా నమోదవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు(DH.Srinivasarao) సూచించారు. తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 36వేలకు పైగా యాక్టివ్‌ కేసుల సంఖ్య ఉండగా తెలంగాణలో 811 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి