AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: కాలేజీలో అడుగుపెట్టగానే విద్యార్థులకు షాకింగ్ సీన్.. దగ్గరికి వెళ్లి చూస్తే గుండె పేలినంత పనైంది..

తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థులను, అధ్యాపకులను షాక్‌కు గురిచేసింది. కాలేజీలో 5 అడుగుల జెర్రిపోతు దర్శనమిచ్చింది. పామును గుర్తించిన విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. . కాలేజీలో పాముందని లెక్చరర్లు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్‌ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు.

Andhra News: కాలేజీలో అడుగుపెట్టగానే విద్యార్థులకు షాకింగ్ సీన్.. దగ్గరికి వెళ్లి చూస్తే గుండె పేలినంత పనైంది..
Snake
Raju M P R
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Dec 27, 2024 | 8:00 PM

Share

తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చిన అధ్యాపకులకు విద్యార్థులకు ఒక దృశ్యం షాక్‌కు గురిచేసింది. టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉన్న ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో 5 అడుగుల జెర్రిపోతు దర్శనమిచ్చింది. పామును గుర్తించిన విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంకేముంది పాములను పట్టడంలో ఎక్స్‌పర్ట్ అయిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు గుర్తుకొచ్చాడు. కాలేజీలో పాముందని లెక్చరర్లు సమాచారం ఇచ్చారు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. భాస్కర్ నాయుడు చేతికి పైన ఉన్న జెర్రిపోతును స్థానికులు ఆశ్చర్యంగా గమనించారు. పాము తలను పట్టుకుని తన వెంట తెచ్చుకున్న సంచిలో పామును బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత పాముతో బైక్‌పై వెళ్ళిన భాస్కర్ నాయుడు సేఫ్‌గా శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇలా తిరుపతి, తిరుమలలో తరచూ జనావాసాలు చూస్తున్న విష సర్పాలను పట్టుకొని సేఫ్‌గా శేషాచలం కొండల్లో భాస్కర్ నాయుడు వదిలి పెడుతూనే ఉన్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి