AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భయం.. భయం.. జనం వెంట పడి దాడి చేసిన ఎలుగుబంటి.. చివరకు..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోన్న ఎలుగుబంటి మృతి చెందింది. స్థానిక తోటల్లో విగతజీవిగా పడి ఉన్న బల్లూకంను చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అటవీ,పోలీస్ అధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి కళేబరానికి అక్కడే వైద్యులతో పోస్ట్ మార్టం నిర్వహించారు.

Watch Video: భయం.. భయం.. జనం వెంట పడి దాడి చేసిన ఎలుగుబంటి.. చివరకు..
Sloth Bear Attacks Villagers
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 6:06 PM

Share

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోన్న ఎలుగుబంటి మృతి చెందింది. స్థానిక తోటల్లో విగతజీవిగా పడి ఉన్న బల్లూకంను చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అటవీ,పోలీస్ అధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి కళేబరానికి అక్కడే వైద్యులతో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఎలుగుబంటి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎలుగుబంటి మృతికి ముందు గ్రామంలోనీ లక్ష్మీనారాయణ, పున్నయ్య ,మోహనరావు సోమయ్య అనే నలుగురిపై దాడి చేసింది. స్వల్పంగా గాయపడిన నలుగురు వ్యక్తులు హరిపురం CHC లో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం ఉదయం నారాయణపురం గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చింది.. వీధుల్లో తిరుగాడుతూ హల్చల్ చేసింది. పాపారావు అనే వ్యక్తిని ఎలుగుబంటి శుక్రవారం వెంబడించడంతో అతను పరిగెడుతూ పడిపోయి గాయపడ్డాడు. ఒక్కసారిగా ఊరులోకి ఎలుగుబంటి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు స్థానిక యువకుల సహాయంతో గ్రామస్తులు ఎలుగుబంటిని గ్రామం నుండి సమీప తోటలలోకి తరిమివేశారు. అయితే గ్రామంలోకి చొరబడ్డ ఎలుగుబంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఎవరు దాన్ని కవ్వించడం లేదా దానికి సమీపంగా వెళ్ళటం వంటివి చేయొద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరించారు. అలా చేస్తే ఎలుగుబంటి దాడి చేసే అవకాశం ఉందని సూచించారు.

వీడియో చూడండి..

అయితే ఇంతలోనే ఎలుగుబంటి రెండో రోజు తోటలలోకి ఉపాధి పనులకు వెళ్లిన వారిపై దాడి చేసింది. ఏం జరిగిందో ఏమో కానీ.. చివరకు ఎలుగుబంటి మృతి చెంది కనిపించింది. ఇదిలాఉంటే.. నిత్యం ఎలుగుబంట్లు గ్రామాల్లోనికి వస్తున్నా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.. గతంలో కూడా ఎలుగుబంటుల దాడిలో ఉద్ధానం ప్రాంతంలో పలువురు మృత్య వాత పడ్డారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలుగుబంట్లు మళ్లీ గ్రామాల్లోకి వస్తుండటంతో భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..