Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో షాక్.. రోజు రోజుకు తగ్గుతున్న గ్రాఫ్.. కారణం అదేనా?

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను వైసీపీ తలకిందులు చేసింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన అధికార వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మరోసారి గట్టి షాక్ తగిలింది.

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో షాక్.. రోజు రోజుకు తగ్గుతున్న గ్రాఫ్.. కారణం అదేనా?
Chandra Babu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2021 | 4:32 PM

Kuppam Municipality result Shock in TDP: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను వైసీపీ తలకిందులు చేసింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన అధికార వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మరోసారి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకు ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీకి ఘోర పరాభవం తప్పడంలేదు. ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి చూశారు. తాజాగా మిగిలిన మున్సిపల్ ఫలితాలు కూడా తీవ్ర బాబుకు తీవ్ర నిరాశను కలిగించాయి. తాజాగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరుతామని.. ఈసారి బాబు కంచుకోట బద్దలు కొట్టేస్తామనేలా వైసీపీ.. అదంతా జరగని పని అంటూ టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే తాజా కౌంటింగ్‌ను బట్టి చూస్తే.. నిమిషనిమిషానికి పరిస్థితులు మారిపోతూ వచ్చాయి.

కుప్పం పురపాలక సంఘంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా సాగింది. చివరికి అధికార వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది. కుప్పం కూడా వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్‌ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్‌లోనే తేలిపోయింది. మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌​పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకుంది. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 1,2,3,4,6,7,8,9,10,12,13,15 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. 5,11 వార్డుల్లో టీడీపీ గెలిచుకుంది. కుప్పంలో విజయం సాధించడంతో.. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

కుప్పం మున్సిపాలిటీలో గెలుపొందిన కార్పొరేటర్లు వీరే..

1వ వార్డు వైసీపీ అభ్యర్థి నాగరాజు 654 మెజారిటీ. 2వ వార్డు వైసీపీ అభ్యర్థి మునిరాజు 354 మెజార్టీ 3వ వార్డు వైసీపీ అభ్యర్థి అరవింద్ 98 మెజారిటీ 4వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజమ్మ 215 మెజారిటీ 5వ వార్డు టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్. 156 మెజారిటీ 7వ వార్డు వైసీపీ అభ్యర్థి నాగరాజు 300 మెజారిటీ 8వ వార్డు వైసీపీ అభ్యర్థి చంద్రమ్మ 314 మెజారిటీ 9వ వార్డు వైసీపీ అభ్యర్థి హఫీజ్ 77 మెజారిటీ 10వ వార్డు వైసీపీ అభ్యర్థి మమత 276 మెజారిటీ 11వ వార్డు టీడీపీ అభ్యర్థి కస్తూరి 6 మెజారిటీ 12వ వార్డు వైసీపీ అభ్యర్థి మాధవి 188 మెజారిటీ 13వ వార్డు వైసీపీ అభ్యర్థి హంస 115 మెజారిటీ 14వ వార్డు వైసీపీ అభ్యర్థి మునస్వామి ఏకగ్రీవం.

గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కుప్పం పరిధిలో టీడీపీకి వైసీపీ షాకిచ్చింది. ఇప్పుడు అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి వైసీపీ ఝలక్ ఇచ్చింది. కుప్పంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. అయితే చంద్రబాబు నియోజకవర్గంలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. ఆ విషయంలో విజయం సాధించింది. 69 MPTC స్థానాలకు ఎన్నికలు జరిగితే, 63 చోట్ల వైసీపీ విజయం సాధించింది. కేవలం ఆరు చోట్లకే పరిమితమైంది టీడీపీ. ఇక, 89 సర్పంచుల్లో 69 చోట్ల వైసీపీ ఘనవిజయం సొంతం చేసుకుంది. కేవలం 20 పంచాయతీలతో తెలుగు దేశం పార్టీ సరిపెట్టుకుంది.

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల ముందు నుంచే కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 2014తో పోలిస్తే దాదాపు 14 వేలు తగ్గింది. గత ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు మెజార్టీని పరిశీలిస్తే అసలు గ్రాఫ్ ఎలా తగ్గుతుందో అర్థమవుతోంది. టీడీపీకి కంచు కోటా అయిన కుప్పంలో వైసీపీ గెలవడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గిన చంద్రబాబు మెజార్టీ 2004 – 59,588 2009 – 46,066 2014 – 47,121 2019 – 30,722

ఇదిలావుంటే, కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సర్పంచ్, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని అక్కడి ప్రజలు సాగనంపుతున్నారన్నారు. ఈ ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలిగితే సంతోషిస్తామన్నారు. చంద్రబాబుకు 72 సంవత్సరాల వయసు వచ్చిందని.. ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే.. తమను కానీ .. తమ సీఎం జగన్‌ను కానీ వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Read Also…  AP Rains Alert: రేపు ఏపీ తీరాన్ని తాకనున్న అల్పపీడనం.. రాగల మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ