AP Rains Alert: రేపు ఏపీ తీరాన్ని తాకనున్న అల్పపీడనం.. రాగల మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

AP Rains Alert: మంగళవారం ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దునున్న ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం ఈరోజు ఆగ్నేయ బంగాళా ఖాతం దాని..

AP Rains Alert: రేపు ఏపీ తీరాన్ని తాకనున్న అల్పపీడనం.. రాగల మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Ap Weather Report
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 2:11 PM

AP Rains Alert: మంగళవారం ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దునున్న ఉత్తర అండమాన్ సముద్రం వద్ద ఉన్న అల్పపీడనం ఈరోజు ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దుని ఆను కొని ఉన్ననైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతేకాదు ఈ అల్పపీడనం దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టము నకు 5 .8 కి.మీ ఎత్తు వరకువ్యాపించి ఉందన్నారు. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి , పశ్చిమ మధ్య , దానిని ఆను కొని ఉన్ననైరుతి బంగాళా ఖాతం వద్ద నున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ , ఉత్తర తమిళనాడు తీరాన్నీ రేపు ఉదయం తాకనుందని చెప్పారు. మరొక అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రం దాని పరిసర ప్రాంతమైన గోవా, దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు గల అల్పపీడనం, దానికి అనుబంధంగా గల ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4 .5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉందన్నారు. దీంతో రాగాల మూడు రోజుల వరకూ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అంతేకాదు రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర:  ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .  ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది . భారీ నుండి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముంది.  ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ : ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

Also Read:   తవ్వకాల్లో బయల్పడిన పురాతన దేవాలయం.. 4,500 ఏళ్లనాటి సూర్య దేవాలయంగా గుర్తింపు.. ఎక్కడంటే.. 

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..