AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensational Verdict: తండ్రి కొడుకులకు ఉరిశిక్ష.. తల్లికి యావజ్జీవ శిక్ష.. ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు

కర్నూలు జిల్లాలో సంచ‌లనం సృష్టించిన కేసులో చారిత్రాత్మక తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకుల‌కు ఉరిశిక్షతో పాటు తల్లికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. క‌ర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

Sensational Verdict: తండ్రి కొడుకులకు ఉరిశిక్ష.. తల్లికి యావజ్జీవ శిక్ష.. ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు
Death Sentence
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 21, 2024 | 7:36 PM

Share

కర్నూలు జిల్లాలో సంచ‌లనం సృష్టించిన కేసులో చారిత్రాత్మక తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకుల‌కు ఉరిశిక్షతో పాటు తల్లికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. క‌ర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

గత ఏడాది మార్చి నెలలో పెళ్లయిన 14 రోజులకే నవ వధువును అనుమానంతో కడతేర్చిన అత్తింటికి వారికి కఠిన శిక్ష విధించింది కర్నూలు కోర్టు. ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు రుజువు కావడంతో భార్య, అత్తను చంపి మామను తీవ్రంగా గాయ‌ప‌రిచిన కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 14 రోజులకే ఆమె పాలిట అనుమానం పెనుభూతమైంది. అప్పటి నుంచి వేధింపులకు పాల్పడ్డాడు శ్రవణ్ కుమార్. రుక్మిణికి చిత్రవధ చూపించాడు. అంతేకాదు తల్లిదండ్రులతో కలిసి రుక్మిణితో పాటు ఆమె తల్లి రమాదేవిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు శ్రవణ్ కుమార్. అడ్డొచ్చిన రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని దారుణంగా గాయపరిచాడు. ఈ ఘటనపై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పట్లో కేసు న‌మోదైంది.

విచారణ చేపట్టిన కర్నూలు పోలీసులు.. నిందితులపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో కేవలం సంఘటన జరిగిన 13నెల లోపల విచారణ పూర్తి చేసింది కోర్టు. నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనాత్మకమైన తీర్పు చెప్పారు. శ్రవణ్ కుమార్‌తో పాటు అతని తండ్రికి ఉరి శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఈ దారుణంలో పాలుపంచుకున్న శ్రావణ్ తల్లికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కర్నూలు కోర్టు. కోర్టు తీర్పు పట్ల రుక్మిణి కుటుంబసభ్యులతో పాటు ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…