Ys Viveka murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం

మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా విచారణ చేస్తున్న సీబీఐ...

Ys Viveka murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం
Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case
Follow us

|

Updated on: Jul 23, 2021 | 9:11 PM

మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా విచారణ చేస్తున్న సీబీఐ.. కీలక ఆధారాలు సేకరిస్తోంది. వివేకాది సుపారీ హత్యగా తేల్చినట్టు చెప్తున్నారు. ఈ కేసులో వాచ్‌మన్‌ రంగయ్య వాంగ్మూలంగా కీలకంగా మారింది. వైఎస్‌ వివేకా హత్య వెనుక 9 మంది ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని చెప్తున్నారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌ ముందు వాచ్‌మన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. వివేకా హత్య కోసం రూ.9 కోట్ల సుపారీ ఇచ్చినట్లు రంగయ్య స్టేట్మెంట్ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్‌ కేసును సీరియస్‌గా తీసుకుంది సీబీఐ. గతంలోను ఎంక్వైరీ చేసినా… రీసెంట్‌గా 47 రోజులుగా కడపలోనే మకాం వేశారు సీబీఐ అధికారులు. అనుమానితులను ప్రతి రోజూ ప్రశ్నిస్తున్నారు. కడప సబ్‌జైల్‌ గెస్ట్‌హౌస్ కేంద్రంగా విచారణ జరుపుతున్నారు. అవసరాన్ని బట్టి పులివెందులకు సైతం వెళ్లి విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా వాచ్‌మన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారింది.

అయితే గతంలో జరిగిన విచారణ లోనూ, ఇప్పుడు జరుపుతున్న విచారణ లో పదే, పదే ఆ ఆరుగురు అనుమానితులను మాత్రమే విచారిస్తూ ఉండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగన్న, ఇనాయతుల్లా తో పాటు ఉమామహేశ్వరరెడ్డిలను సీబీఐ అధికారులు పదే, పదే విచారిస్తున్నారు.  వీళ్లతో పాటు జిల్లాలోని కొత్త కొత్త వ్యక్తులు, మహిళల పేర్లు కూడా తెర మీదకు వస్తూ ఉండడంతో ఈ కేసు విషయంలో సీబీఐ ఎంత లోతుగా దర్యాప్తు జరుపుతుందో అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికి గతంలో కంటే వివేకా హత్య కేసు విషయంలో దూకుడు పెంచిన సీబీఐ కీలక సమాచారం రాబట్టింది.

Also Read:మహారాష్ట్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం