Dwaraka Tirumala: శ్రీవారి సన్నిధిలో మహిళా యాచకులపై అమానుష దాడి.. స్పందించిన భద్రతా విభాగం

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు.

Dwaraka Tirumala: శ్రీవారి సన్నిధిలో మహిళా యాచకులపై అమానుష దాడి.. స్పందించిన భద్రతా విభాగం
Attack On Beggars
Follow us

|

Updated on: Nov 26, 2021 | 5:34 PM

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు. దెబ్బలు తాళ్లలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారనే కారణంతో మహిళా యాచకులను భద్రతా సిబ్బంది మోకాళ్లపై నిలబెట్టి, కర్రలతో చితకబాదారు. ద్వారకా తిరుమలలోని శివాలయం దగ్గర యాచకులపై ఈ దాడి జరిగింది. భక్తులు ఆలయానికి వస్తుంటే..వారికి ఇబ్బంది కలిగించేరీతిలో భిక్షాటన చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడున్న యాచకులందరినీ కర్రతో బాదుతూ ఓ దగ్గరకు తీసుకొచ్చారు సెక్యూరిటీ సిబ్బంది. మహిళలని చూడకుండా మోకాళ్లపై కూర్చొబెట్టారు. భుజాలు, వీపు, కాళ్లపై కర్రలతో గొడ్డును బాదినట్లు బాదేశారు.

మరోవైపు తాము వెళ్లిపోతామని చెప్పినా కనికరం చూపకుండా సెక్యూరిటీ సిబ్బంది కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై టీవీ9 బృందం ఆరా తీసింది. అయితే భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతోనే వాళ్లను మందలించామని దేవస్థానం భద్రతా విభాగం అధికారి సూర్యనారాయణ చెప్పారు. మోకాళ్లపై యాచకులను నిలబెట్టినందుకు తాము భద్రతా సిబ్బందిని మందలించామన్నారు. భక్తులు వస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ అడ్డుపడుతున్నారని..వారికి గతంలోనే కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. అంతేకాదు స్వీపర్లుగా ఉద్యోగం ఇస్తామని చెప్పినా వారు నిరాకరించారన్నారు. గతంలో కొందరి భక్తుల పర్సులు కూడా కొట్టేశారని చెప్పారు. అందుకే వారిని కంట్రోల్‌ చేయడానికి మందలించామని చెప్పుకొచ్చారాయన.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!