Sangam Dairy: సంగం డెయిరీ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. జీవోను కొట్టివేస్తూ తీర్పు

Sangam Dairy: సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను..

Sangam Dairy: సంగం డెయిరీ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. జీవోను కొట్టివేస్తూ తీర్పు
Sangam Dairy
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2021 | 1:42 PM

Sangam Dairy: సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని.. డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ సర్కార్‌ ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై  న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలుపగా, తాత్కాలికంగా ఈ జీవో ఇచ్చామని, సంగం డెయిరీ రోజు వారీ విధులు నిర్వహించేందుకు మాత్రమే అధికారులను ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అలాగే సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ సమాచారాన్ని.. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Vizag Gas Leak: మానని గాయం.. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ విషాద ఘటనకు ఏడాది.. వెంకటాపురం గ్రామస్థులను వీడని భయం

Eluru Elections Counting: ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్