Eluru Elections Counting: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Eluru Elections Counting: ఏపీలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరపాలని కోర్టు సూచించింది..
Eluru Elections Counting: ఏపీలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరపాలని కోర్టు సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో 56.86% పోలింగ్ నమోదైంది.
అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని, ఎన్నికలు వాయిదా వేయాలని మార్చి 8న దాఖలైన పిటిషన్‌పై ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయమై ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని ఈ మార్చి 9న ఆదేశించింది. అయితే ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక తాజాగా హైకోర్టు కౌంటింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఇక ఏలూరు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.